ఎస్సీ,ఎస్టీ చట్టంపై స్టే తిరస్కరణ

SUPREME COURT
SUPREME COURT

న్యూఢిల్లీ: 2018లో ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టంపై చేసిన నూతన సవరణలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎస్సీ, ఎస్టీలపై వేధింపులకు పాల్పడిన వారిని ఎలాంటి విచారణ లేకుండానే అరెస్టు చేసేందుకు ఈ సవరణ చట్టం అనుమతిస్తుంది. అయితే ఈ చట్టంలోని సవరణలకు వ్యతిరేకంగా దాఖలైన అన్నిపిటిషన్లతో పాటు గత సంవత్సరం మార్చి 20న సుప్రీం ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను కలిపి ఒకేసారి విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. కాగా ఎస్సీ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టానికి చేసిన నూతన సవరణలు న్యాయవిరుద్దమని ప్రకటించాలని పిటిషనర్లు కోరుతున్నారు.