ఎస్సార్‌ ప్రాజెక్టులకు రూ.2వేల కోట్ల రాబడులు

Essr
Essr

ఎస్సార్‌ ప్రాజెక్టులకు రూ.2వేల కోట్ల రాబడులు

ముంబయి: ఎస్సార్‌ప్రాజెక్ట్సు గత ఏడాది రూ.2వేల కోట్ల రాబడులు సాధించినట్లు ప్రకటిం చింది. ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ నిర్మాణరంగ కంపెనీ దేశంలో మొత్తం పది ప్రాజెక్టులను పూర్తిచేసిం ది. గత ఆర్థిక సంవత్సరంలో చూస్తే రెండువేల కోట్ల రాబడులు సాధించింది. కంపెనీకి మత్తం ఎని మిదవేల కోట్లకుపైగా ఆర్డర్‌ బుక్‌ ఉందని మరింతగా రాబడులు సాధిస్తామని చీఫ్‌ఆపరేటింగ్‌ అధికారి ఎవి అమర్‌నాధ్‌ వెల్లడించారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ 15 ఎంఎంటిపిఎ పరదీప్‌ శుద్ధిప్రాజెక్టు, సౌరాష్ట్ర నర్మద అవతరన్‌ ఇరిగేషన్‌ పైప్‌లైన్‌ యోజనప్రాజెక్టు, కలాదన్‌ మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్టుప్రాజెక్టు వంటి మెగా ప్రాజెక్టు లు సైతం పూర్తిచేసింది.

అత్యంత భారీ ప్రాజెక్టులు చేపట్టి పూర్తిచేయడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటురంగాల్లో కూడా మంచి పట్టుసాధించిందని అమర్‌నాధ్‌ వెల్లడించారు. ప్రస్తుతం చేతిలో ఉన్నప్రాజెక్టులను పూర్తి చేస్తామని వివరించారు. కీలకమౌలికవనరుల వృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టినందున మరిన్ని అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. నిర్దిష్టమైన వ్యవధిలోపు ప్రాజెక్టులను పూర్తిచేయడం, మొత్తం సాంకేతికపరిజ్ఞానంపై అవగాహన వంటివి తమకు కలిసొచ్చినట్లు అమర్‌నాధ్‌ వెల్లడించారు. దేశంలో ఇపిసి పద్ధతిలో కాంట్రాక్టులు చేపడుతున్న సంస్థలుఅనేకం ఉన్నాయి. అయితే ఎస్సార్‌ప్రాజెక్ట్స్‌పరంగా మెగాప్రాజెక్టులు ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాది మొత్తంగా 2862 కోట్ల ప్రాజెక్టులు పూర్తిచేసిందంటే కంపెనీ పనితీరుకు నిదర్శనమని అమర్‌నాధ్‌ వెల్లడించారు. కంపెనీ ప్రాజెక్టులపరంగా ఎక్కువగా చమురుశుద్ధి ప్రాజెక్టులు ఉన్నట్లు కంపెనీ వివరించింది