ఎస్సారెస్పీలో పెరిగిన విద్యుత్ప‌త్తి

Sriram sagar
Sriram sagar

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో మూడు టర్బయిన్లతో విద్యుదుత్పత్తి జరుగుతోందని ఇన్‌చార్జ్ ఎస్‌ఈ శ్రీనివాస్ తెలిపారు. కాకతీయ కాలువలో వదిలిన 5,500 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుని ఒక్కో టర్బయిన్ నుంచి 6.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. మూడు టర్బయిన్ల ద్వారా 18.6 మెఘావాట్ల విద్యుత్ ఉత్పిత్తి జరుతోతుందన్నారు. రెండు రోజులుగా 0.6700 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందని డీఈ తెలిపారు.