ఎస్కార్ట్స్‌- కుబోటా జాయింట్‌ వెంచర్‌

escorts
escorts

ఎగుమతి మార్కెట్లపైనే ఫోకస్‌
ముంబయి: ఆటోమొబైల్‌ రంగంలో ప్రముఖ సంస్థ ఎస్కార్ట్స్‌ జపాన్‌కు చెందిన కుబోటా కార్పొరేషన్‌ ట్రాక్టర్ల తయారీకోసం ప్రత్యేక ఒప్పందంచేసుకున్నాయి. గ్లోబల్‌ జాయింట్‌ వెంచర్‌కు వచ్చాయి. విదేశీ ఎగుమతులు, దేశంలో మార్కెట్‌వాటా సుస్థిరంచేసుకునేదిశగా ఈ ఒప్పందం జరిగింది. జాయింట్‌ వెంచర్‌ను 50వేల యూనిట్ల ఉత్పత్తిసామర్ధ్యంతో నెలకొల్పాలనిచూస్తున్నాయి. దేశీయ మార్కెట్లలో తమకున్న వేరువేరు నెట్‌వర్క్‌లద్వారా విక్రయిస్తాయి. ఈ ఒప్పందం ప్రకారం ఎస్కార్ట్స్‌ ట్రాక్టంర్లను కుబోటా ఎంపికచేసిన మార్కెట్లకు ఎగుమతిచేస్తుంది. ఎస్కార్ట్స్‌ కుబోటా భారత్‌లో తమ పంపిణీ చానెళ్లను స్వతంత్రంగా అభివృద్ధిచేస్తాయి. ఇందుకుగాను ముందురూ.300 కోట్ల ప్రారంభ పెట్టుబడి సమకూరుస్తున్నారు. 60ః40 నిష్పత్తిలో ఈ కొత్త ఉత్పత్తి జాయింట్‌ వెంచర్‌ ప్రపంచస్థాయిలో అత్యంత నాణ్యతాప్రమాణాలను పాటిస్తుందని అంచనా. మధ్య,దీర్ఘకాలికంగా దేశీయ ఎగుమతి మార్కెట్లలో కీలకస్థానంలో నిలుస్తామని ఎస్కార్ట్స్‌ సిఎండి నిఖిల్‌ నందా వెల్లడించారు. ఎస్కార్ట్స్‌తో మా భాగస్వామ్యం ఏర్పడటం ఎంతో సంతోషంగా ఉందని కుబోటా కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మసాటోషి కిమటా పేర్కొన్నారు. వ్యవసాయ యంత్రసామగ్రి మార్కెట్లలో వైవిద్యభరితమైన పోర్టుఫోలియోఉన్న ఎస్కార్ట్స్‌ కుబోటా గ్లోబల్‌ టెక్నాలజీతో మరింత వృద్ధిలోనికి జాయింట్‌ వెంచర్‌ వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. మొత్తం మీద దేశీయ,ఎగుమతి మార్కెట్లపైనే ఈ జాయింట్‌ వెంచర్‌ ఎక్కువ ఫోకస్‌ పెట్టిందని తెలుస్తోంది.