ఎవరైనా సాధించగలరు

                                ఎవరైనా సాధించగలరు

OFFICE WORK
OFFICE WORK

కొందరు తమ నేపథ్యం దృష్ట్యా చదువ్ఞలో సాధించిన ఫలితాల కారణంగా విజయం సాధించలేమని అనుకుంటూ ఉంటారు. ఎవరైనా విజయం సాధించగలరు. మనసూర్తిగా విశ్వసించాలి. ప్రణాళికాబద్ధమైన ఆచరణను పట్టుదలతో కొనసాగించాలి. ఏం చేస్తే సాధించగలరో, ఆ ప్రయత్నాలను ప్రారంభించాలి. ఇలా చేస్తే ఎవరైనా సరే జయాన్ని సాధించగలరు. కృషితో నాస్తి దుర్భిక్షం. విజయం సాధించగలవారు తప్పులు చేయరనే విషయాన్ని గుర్తుం చుకోవాలి. విజయాన్ని సాధించగలవారు సైతం, మనంద రిలాగానే తప్పులు చేస్తే చెయవచ్చు కానీ, వారు తప్పులను సరి దిద్దుకుంటారు.

చేసిన తప్పులను మళ్లీ చేయరు. నిరంతర దిద్దుబాటు వారిని విజయపథం వైపు నడిపిస్తుంది. వారానికి ఉన్న 168 గంటల్లో కనీసం 80, 90 గంటలు పని చేయగలిగితే తప్ప విజయాన్ని పొందలేరు. మనం ఎన్ని గంటలు పని చేశాము అనేదానికన్నా, ఎలా పని చేసాము? సరైన పనులు చేసామా? లేదా? సరిగ్గా చేసామా? లేదా? అనే విషయాలు నిర్ణయాత్మకమవ్ఞతాయి. ఖచ్చితమైన నియమాల్ని, సూత్రాలను అమలు పరిస్తేనే విజయం వరిస్తుంది. నియమాలు, సూత్రాలు ఎవరు ఏర్పాటు చేశారు? ప్రతి పరిస్థితిలోనూ ప్రత్యేకత ఉండవచ్చు.

కొన్ని సందర్భాలలో సూత్రాలను పాటించవలసిన అవసరం ఉండవచ్చు. ఇతర సందర్భాలలో మీకై మీరు పూనుకుని ప్రత్యేక సూత్రాలను, నియమాలను నిర్ణయించవలసిన అవసరం ఏర్పడవచ్చు. మీ ప్రయత్నంలో మీరింకెవరి సహాయ, సహకారాలైనా స్వీకరిస్తే, అది మీ విజయం కింద పరిగణించకూడదు. విజయ సాధన శూన్యంలో సాధ్యమా? మీ విజయానికి దోహదపడేవారి సహాయం స్వీకరించడంలో ఏ మాత్రమూ సంశయించవద్దు. అలా మంచివారికి సహాయపడేవారు ఎందరో ఉంటారు. విజయం పొందాలంటే అదృష్టం ఉండటం తప్పనిసరా? బహుశా విజయం సాధించటానికి కొంత అదృష్టం అవసరమే కావచ్చు.

కానీ ఆ కొంత అదృష్టం కన్నా ఎన్నో రెట్లు మిన్నగా కష్టపడి పని చేసే మనస్తత్వం తదేక దీక్షతో కృషి చేసే ఏకాగ్రత, క్రమశిక్షణ, పట్టుదల, విజ్ఞానం, కళాకౌశలం, నైపుణ్యాలను సార్థకంగా అమలు చేసే సామర్థ్యం తప్పనిసరిగా అవసరమవ్ఞతాయి. చాలా డబ్బు సంపాదిస్తే అది విజయం కింద పరిగణించాలా? అంటే, విజయం అనేది చాలా అంశాలకు వర్తిస్తుంది. డబ్బు కేవలం అందులో ఒక అంశం మాత్రమే. డబ్బు ప్రధానమైనదీ కాదు, ప్రప్రథమమైనదీ కాదు. అందరికీ తెలిసినప్పుడే దానిని విజయంగా పరిగణించాలా? అంటే – మీరు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు.

ఎంతోమంది చేత మీరు సాధించిన విజయానికి ఎన్నో ప్రశంసలు పొందవచ్చు. కానీ, మీ ఒక్కరికి మాత్రమే తెలిసినంత మాత్రాన మీ నిజమైన విజయం, విజయం కాకుండా ఉంటుందా? గుర్తింపుల కోసం వెంపర్లాడనక్కరలేదు. మీ లక్ష్యం మీ మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఈ దిశా నిర్దేశం మీ జీవితంలోని అన్ని రంగాలకు వర్తిస్తుంది. మీ వ్యక్తిగత జీవితానికి, లౌకికపరమైన వ్యవహారాలకి, ఉద్యోగ సంబంధ విషయాలకు, ఇది అది అనడమెందుకు?

అన్ని విషయాలకు, ఆధ్యాత్మికత విషయంతో సహా లక్ష్యాల నిర్దారణ విజయ సాధనకు ఎంతో అవసరం. లక్ష్యాల నిర్దేశన జీవితానికి ఒక ప్రయోజ నాన్ని, ముందుకు సాగడానికి కావలసిన ప్రేరణను సమకూరు స్తాయి. ఉదయం తొందరగా లేవడానికి, రాత్రి ఎక్కువసేపు మేల్కొని పని చేయడానికి కావలసిన ప్రేరణను అందిస్తుంది. లక్ష్య నిర్ణయం అంటే చేరదలచిన గమ్య స్థానాన్ని నిర్ణయించుకోవడమే!