ఎవరెస్టును అధిరోహించిన ఏపి విద్యార్ధులు

Everest
Everest

అమరావతి: ఏపికి చెందిన ఐదుగురు విద్యార్ధులు ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు. విశాఖపట్టణం జిల్లా గోలుగొండకు చెందిన జి.రాజు, తూ.గో.జిల్లా అడ్డతీగలకు చెందిన ప్రసన్న, కొత్తూరుకు చెందిన భానుసూర్యప్రకాశ్‌, పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగికి చెందిన ప్రవీణ్‌, నెల్లూరు జిల్లా చిట్టేడు గ్రామానికి చెందిన వెంకటేష్‌ అనే విద్యార్ధులు ఈ ఘనతను సాధించారు. గత రెండేళ్లుగా శిఖరారోహణకు సంబంధించి వీరికి ట్రైబల్‌ వెల్ఫేర్‌, సోషల్‌ వెల్ఫేర్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన ఈ విద్యార్ధులను ప్రభుత్వ యంత్రాంగం అభినందించింది.