ఎవరు ధన్యులు

SUNDARA CHAITANYANANDA

ఎవరు ధన్యులు

ధన్యాః అంటే భాగ్యవంతులు. ఎవరు భాగ్యవంతులు? యే పురుషాః కృతార్థాః తే ధన్యాః ఎవరు కృతార్థులో వారే ధన్యులు. కృతార్థులు అంటే కృతమైన అర్థములు గలవారు. అంటే తీరిన కోరికలు గలవారు అని భావం. కోరికలు తీరినవారు ధన్యులు అంటే, కొన్ని కోరికలు తీరి మరికొన్ని కోరికలు మిగిలియున్నవారా? లేక కోరికలు సంపూర్ణంగా తీరినవారా? కోరికలు మిగిలి ఉంటే వారు కృతార్థులెలా అవ్ఞతారు? ధన్యులెలా అవ్ఞతారు? కనుక ధన్యులంటే తీరని కోరికలు లేనివారని అర్థం. కోరికలు తీరినవారు కాకుండా కోరికలు లేనివారు ధన్యులు. ధన్యోసి-నీవ్ఞ ధన్యుడవ్ఞ. ధన్మోస్మి-నేను ధన్యుడను అనే మాటలు తరుచుగా వింటూ ఉంటాం. ‘నీకు అనుకూలవతి అర్ధాంగిగా లభించింది. నీవ్ఞ ధన్యుడవ్ఞ. నీకు మగసంతానం కలిగింది. న్డీవు డేపకప న్యుడవ్ఞ. ప్రమాదంలో కారులోని వారందరు మరణించినా నీవ్ఞ ప్రాణాలతో బయటపడ్డావ్ఞ, ధన్యుడవ్ఞ. వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉన్నావు.. ధన్యుడవు. కోట్లు ఆర్జించావు.,

నీ జన్మధన్యం. పుణ్యకర్మలెన్నో చేశావ్ఞ. నీ జన్మధన్యం. ఇలా ఇతరులను ధన్యులుగా మనం ప్రశంసిస్తూ ఉంటాం. వాటినే మనలో చూసుకొని మనం ధన్యులమని భావిస్తూ ఉంటాం. ధనం పుణ్యం లబ్ధం యేన స ధన్యః ధనాన్ని (ఇహలోక భాగ్యాన్ని), పుణ్యాన్ని (పరలోక సుఖాన్ని) పొందినవాడు ధన్యుడు అని సాధారణంగా భావిస్తూ ఉంటారు. ఇవేవీ జీవితానికి ధన్యతను ప్రసాదించవ్ఞ. జీవిని ధన్యునిగా తీర్చిదిద్దలేవ్ఞ. నిలకడలేనివి ప్రసాదించే భాగ్యాలు ఒకనాడు నిలవకుండా పోయేవే. ప్రతికూలాలకు అవకాశమిచ్చే అనుకూలాలు భాగ్యాలా? మరణం ఎదురు చూచేటప్పుడు ప్రమాదం నుండి బయటపడటం ప్రమోదమా? అనారోగ్యానికి గురై, వల్లకాటిలో అదృశ్య మయ్యే దేహం ఒక కాలంలో ఆరోగ్యంగా ఉండటం భాగ్యమా? స్వప్నంలా అనుభవానికి అంది చేజారిపోయే స్వర్గాన్ని ప్రసాదించే పుణ్యం భాగ్యమా? మరి ఉన్నవేవీ భాగ్యాలు కానపుడు, ఏదీలేక పోవటము భాగ్యమా? కౌపీన వంతః ఖలు భాగ్యవన్తఃI గోచి గలవాడే ఘనుడా? భాగ్యవంతుడా? ధన్యుడా? భౌతిక భాగ్యాలు భాగ్యాలు కానపుడు భౌతిక దారిద్య్రాలు భాగ్యాలెలా అవుతాయి? ఉన్నది భాగ్యం కాదంటే, లేనిది భాగ్యమని భావం కాదు. ఊడిపోనిది, వీడిపోనిది భాగ్యం. వెలితి లేనిది భాగ్యం.

అదియే ఆత్మ. జ్ఞానం ఆత్మలక్షణం. అట్టి ఆత్మజ్ఞానమును పొందినవాడు ఏమీ లేనివాడైనా (కౌపీనవన్తః) భాగ్యవంతుడే. ఏది ఉన్నా, ఏది ఊడినా అట్టి వారి భాగ్యానికి కొరత లేదు. కనుక భాగ్యవంతులయ్యేందుకు వారు ఏమీ చేయనవసరం లేదు. అన్నీ చేసిన వారే అయ్యారు. అన్నీ పొందినవారే అయ్యారు. కనుక వారు కృతార్ధులు. ధన్యులు. ధన్యులంటే ప్రపంచంలో ఏవో ఏవో పొందినవారు కారు. మరేవేవో పోగొట్టుకున్న వారూ కారు. పరమాత్మను పొందిన వారు ధన్యులు. పరమాత్మ, పరమాత్మ జ్ఞానము వేరు కావ్ఞ. కనుక పరమాత్మ జ్ఞానమును పొందిన వారు ధన్యులు. అంతేకాదు. పొందేందుకు కృషి చేయు సాధకులు కూడా ధన్యులే. నిన్నటి సాధకులే నేడు సిద్ధులైతే నేటి సాధకులు రేపు సిద్ధపురుషులు. ఇద్దరూ సిద్ధ పురుషులే. కృతార్ధులే. ధన్యులే. కృతకృత్యులే.

– చైతన్యానంద