ఎవరు జ్ఞానవంతులు?

rama krishna parama hamsa
rama krishna parama hamsa


మనం ఆధునికులమని, నాగరికులమని, ఎంతో జ్ఞానవంతులమని, మరెంతో సంస్కారవంతులమని అనుకొంటుంటాం. మన పూర్వీకులు అజ్ఞానులని, అనాగరికులని, సంస్కారహీనులని, విజ్ఞానరహితులని అనుకొంటాం. మనకు చాలాచాలా విశాల దృక్పధముందని, వారికి చాలా సంకుచిత దృష్టి ఉండేదని భావిస్తాం. ఈ విశ్వాన్ని గూర్చి, ఈ జీవితాన్ని గూర్చి మనకు ఇప్పుడున్నంత అవగాహన వారికి అప్పుడు ఉండేది కాదని భావిస్తాం. ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలువగలిగే భవంతుల్లో మనం ఉండి షడ్రసోపేతమైన రకరకాల ఆహార పదార్థాలను వండుకొని తింటున్నాం.

ఏ శీతోష్ణపరిస్థితుల్లోనైనా సౌకర్యంగా ఉండే దుస్తులను ధరిస్తున్నాం. మరి వారేమో గుట్టల్లో, గుహల్లో, చెట్ల తొర్రల్లోనో నగ్నంగానో, అర్ధనగ్నంగానో ఉండేవారు. ఆకులు అలుములు తినేవారు. కాబట్టి వారికంటే మనమే ఎంతో ఉన్నతులమని భావిస్తాం. కానీ బాగా పరిశీలిస్తే ఏమి తేలుతుందో, తెలుస్తుందో చూద్దాం. ఎన్నెన్నో ఉన్నత చదువ్ఞలను చదివిన మనం ఈనాడు భగవంతుని ఏమని ప్రార్థిస్తున్నాం? స్వామీ!

నేను పరీక్షల్లో ఉత్తీర్ణుడనయ్యేట్టు చే§్‌ు, నాకు మంచి ఉద్యోగం దొరికేట్టు చే§్‌ు, నాకు మంచి పెళ్లి సంబంధం కుదిరేట్టు చే§్‌ు, నారోగాన్ని నయం చే§్‌ు, నా కష్టాలను తీర్చు, నాకు పిల్లలు కలిగేట్టు చే§్‌ు..ఇదీ వరుస. నవనాగరికులు, విద్యావంతులు, విజ్ఞానఖనులు చేసే ప్రార్థన ఇలా ఉంటుంది. అంతా స్వార్థమే, అంతా లౌకికమే. మతాధిపతులు, పీఠాధిపతులు కూడా దీన్నే ప్రోత్సహిస్తారు. మరి మనం అనాగరికులని, అటవికులని, అజ్ఞానులని ఎవరిని అనుకొంటామో వారు ఆనాడు ఏమని ప్రార్థన చేశారో చూద్దాం.


తేజోసి తేజోమయి ధేహి- ఓ భగవంతుడా! నీవ్ఞ అనంతశక్తి స్వరూపుడవ్ఞ, ఆ శక్తిని మాలో నింపు
వీర్యమసి వీర్యంమయిధేహి- నీవ్ఞ తేజోస్వరూపుడవ్ఞ. ఆ తేజస్సును మాలోనింపు
బలమసి బలం మయిధేహి-నీవ్ఞ అనంత బలస్వరూపుడవ్ఞ. ఆ బలాన్ని మాకు ప్రసాదించు
ఓజోసి ఓ జోమయిధేహి – నీవ్ఞ ఓజశ్శక్తి సంపన్నుడవ్ఞ
ఆ ఓజస్సును మాకు ప్రసాదించు


మన్యురసి మన్యుం మయిధేహి- నీవ్ఞ అనంత ధైర్యస్వరూపుడవ్ఞ.
ఆ ధైర్యాన్ని మాకు ప్రసాదించు
సహోసి సహోమయి ధేహి-నీవ్ఞ అనంతమైన రిమిగలవాడవ్ఞ.
ఆ ఓరిమిని మాలో నింపు
(శ్రీరామకృష్ణప్రభ – జూన్‌ 2013)


దీన్నిబట్టి ఏమర్ధమవ్ఞతుంది? అఖిలాండకోటి బ్రహ్మండనాయకుడైన ఆ భగవంతునిలో ఏమేమి ఉన్నాయో వాటన్నింటినీ ఇచ్చి తన మాదిరిగా వారిని రూపుదిద్దమని కోరటముంది. అంత ఉదాత్తమైన భావాలు ఉన్న వారా లేక క్షుద్రమైన కోరికలున్న మనమా నాగరికులు, విజ్ఞానవంతులు?

  • రాచమడుగు శ్రీనివాసులు