ఎలా సాధ్యమో చెప్పాలి: కృష్ణయ్య

 

krishnaiha
విజయవాడ: బిసిలకు నష్టంలేకుండా కాపులకు రిజర్వేషన్లు చేస్తామంటున్నారు అది ఎలా సాధ్యమో చెప్పాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన బిసి రిజర్వేషన్ల పరిరక్షణ సదస్సులో ఆయన పాల్గొన్నారు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. బలప్రయోగం ద్వారా కాపులు ముందుకు వెళ్లాలని భావించటం సమంజసం కాదని, బిసి జాబితాలో ఏదైనా కులాన్ని జతచేయాలంటే అ కులం జనాబా ఎంతో పరిగణలోకి తీసుకోవాలని ఆయన అన్నారు.