ఎర్ర‌బెల్లి కాన్వాయ్‌కి ప్ర‌మాదం!

trs mla eerrabelli dayakar rao
trs mla eerrabelli dayakar rao

జ‌న‌గామః జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో పాలకుర్తి శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు
ప్రయాణిస్తున్న వాహన శ్రేణిలోని ఓ కారు మరో కారును ఢీకొని చెరువులో బోల్తాపడ్డాయి. బతుకమ్మ
చీరల పంపిణీ కార్య‌క్ర‌మంలో భాగంగా దేవరుప్పల మండలం కడవెండి నుంచి మాదాపురం వెళుతుండగా
మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఎస్కార్ట్‌ వాహన డ్రైవర్‌ చేతికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో
జీసీసీ ఛైర్మన్‌ దరావత్‌ మోహన్‌ గాంధీ నాయక్‌ ప్రయాణిస్తున్న కారు కూడా ప్రమాదానికి గురైంది. ప్రమాదంతో
గాంధీనాయక్‌ భయాందోళనకు గురికావ‌డంతో ఆయనను వెంటనే జనగామ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.