ఎర్ర‌కాలువ‌కు పొటెత్తిన వ‌ర‌ద‌

Erra kaluva dam
Erra kaluva dam

ఎర్ర కాలువ‌కు భారీగా వ‌ర‌ద నీరు పోటెత్తుతుంది. దిగువ‌కు వ‌ర‌ద‌ను వ‌ద‌ల‌డంతో త‌ణుకు మండ‌లం, దువ్వ‌దగ్గ‌ర ఉన్న వెంక‌య్య వ‌య్యేరు మ‌రింత ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుంది. వయ్యేరుకు నీరు పోటెత్త‌డంతో గ‌ట్టుకు రెండు వైపులా ఉన్న గ్రామాలు నీట‌మునిగాయి. ఒక వైపు ఉన్న ఇళ్లు కొన్ని కొట్టుకుపోగా మ‌రికొన్ని నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. దువ్వ‌తోపాటు ప‌స‌ల‌పూడి, సూర్యారావుపాళెం, తేత‌లి, వ‌డ్లూరు గ్రామాల ప‌రిధిలోని పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. పొలాల‌ను మూడ‌డుగుల మేర వ‌ర‌ద నీరు ముంచెత్తింది.