ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్

AIRTEL
AIRTEL

టెలికాం రంగ సంస్థ భారతి ఎయిర్ టెల్ ఇటీవలే సంవత్సరం వ్యాలిడిటీతో రూ.1699 ప్రీ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన వినియోగదారుల కోసం రూ.998, రూ.597 విలువ గల మరో రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. 336 రోజుల వ్యాలిడిటీ గల రూ.998 రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా అన్ లిమిటెడ్ కాల్స్, ప్రతినెలకి 300 ఎస్ఎంఎస్ లతో పాటు పూర్తి వ్యాలిడిటీ కాలానికి 12 జీబీ డేటా లభించనుంది. అలాగే, 168 రోజుల వ్యాలిడిటీ గల రూ.597 రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా అన్ లిమిటెడ్ కాల్స్, ప్రతినెలకి 300 ఎస్ఎంఎస్ లతో పాటు పూర్తి వ్యాలిడిటీ కాలానికి 6 జీబీ డేటాని పొందనున్నారు.