ఎయిర్‌ ఏసియా ప్రత్యేక ఆఫర్లు

b1
Air Asian

ఎయిర్‌ ఏసియా ప్రత్యేక ఆఫర్లు

 

 

ముంబై, నవంబరు 14: బడ్జెట్‌ క్యారియర్‌ ఎయిర్‌ ఏసియా ఇండియా ప్రమోషనల్‌ ఆఫర్‌ కింద అన్ని రుసుంలతో కలుపుకుని రూ.799లకు టికెట్లు ఆఫర్‌ చేస్తోంది. వచ్చేఏడాది రాకపోకలకు ఈఛార్జీలు అమల వుతాయి. ఈనెల 20వ తేదీ వరకూ ఈ ఆఫర్‌ అమలులో ఉంటుంది. 2017మే ఒకటవ తేదీ నుంచి 2018 ఫిబ్రవరి 6 వరకూ ప్రయాణాలకు వీలవుతుం దని ఎయిర్‌ఏసియా ప్రకటించింది. గౌహతి ఇంఫాల్‌ రూట్‌లో ప్రమోషనల్‌ఆఫర్‌ రూ.799గాఅమలవుతుంది. అంతేకాకుండా రూ.999 ఆఫర్‌ అమలులో ఉంది. కోచి బెంగళూరు, హైదరాబాద్‌ బెంగళూరురూట్లలో ఈధరలు న్నాయి. బెంగళూరుగోవా, పుణె బెంగళూరు, బెంగళూ రు విశాఖ రూట్లలో 1299 రూపాయలుగా ఉన్నాయి. హైదరాబాద్‌ గోవా 1599, కోచి హైదరాబాద్‌ 1999లు, ఢిల్లీ బెంగళూరు రూ.2499లుగా ఉన్నాయి. భారత్‌లో ఎయిర్‌ట్రావెల్‌ ను మరింత పెంచేందుకు వీలుగా ఎయిర్‌లైన్స్‌ ఇటు వంటి ప్రమోషనల్‌ ఆఫర్లు అమలుచేస్తాయి. ట్రాఫిక్‌ రద్దీలేని సమయాలో కూడా వీటిని అమలు చేస్తుం టాయి. ఏయిర్‌ఏసియా ఇండి యా ద్వారా మూడునెలల్లో 5.89లక్షల మంది ప్రయా ణీకుల రాకపోకలు సాగించినట్లు తేలింది. గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 42శాతం మంది పెరిగారు.