ఎయిర్‌పోర్టులో స్మిత్‌కు అవమానం

IMG
SMITH

ఎయిర్‌పోర్టులో స్మిత్‌కు అవమానం

జోహనెస్‌బర్గ్‌: బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కి జోహనెస్‌బర్గ్‌ ఎయిర్‌పోర్టులో అవమానం ఎదురైంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టులో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ బెన్‌క్రాఫ్ట్‌ మైదానంలో బాల్‌ టాంపరింగ్‌కి పాల్పడగా…ఇందులో స్మిత్‌ పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. దీంతో..స్మిత్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా (సిఏ) ఏడాది నిషేధం విధించగా …బుధవారం రాత్రి స్వదేశానికి వెళ్లేందుకు జోహనెస్‌బర్గ్‌ విమానాశ్రయానికి ఈ మాజీ కెప్టెన్‌ చేరుకున్నాడు. విమానాశ్రయంలో స్మిత్‌ను చూసిన కొంతమంది ‘ఛీట్‌…ఛీట్‌ అంటూ హేళన చేయగా…మీడియా ప్రతినిధులు అతనితో మాట్లా డేందుకు ప్రయత్నించారు. దీంతో…కాసేపు అక్క డ గందరగోళ వాతావరణం నెలకొంది.

అయితే దక్షిణాఫ్రికా పోలీసలు అందర్నీ వెనక్కి నెట్టుకుం టూ స్మిత్‌ని లోపలికి తీసుకెళ్లారు. కానీ…ఈ తీసుకెళ్లే క్రమంలో స్మిత్‌తో వారు దురుసుగా ప్రవర్తించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది