ఎయిర్‌టెల్ రూ.98 ప్లాన్‌లో మార్పు

AIRTEL
AIRTEL

రిలయన్స్ జియోకి పోటీగా ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ రూ.98లో మార్పులు చేసింది. ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం వినియోగదారులు రూ.98 రీచార్జ్‌పై 5జీబీ (3జీ/4జీ) డేటాని 28 రోజుల వరకు పొందుతారని తెలిపింది. అయితే ఈ 5జీబీ డేటాను 28 రోజుల వ్యవధిలో ఎప్పుడైనా వాడుకోవచ్చని తెలిపింది. కాగా, ఈ ఆఫర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల వారికి మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ ప్లాన్ లో వాయిస్‌ కాలింగ్‌ సదుపాయం మాత్రం లేదు. ఇటీవల ఎయిర్ టెల్ రూ.93 ప్లాన్‌లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే.