ఎయిర్‌టెల్‌ మరో బంపర్‌ ఆఫర్‌

AIRTEL
AIRTEL

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌ టెల్‌ తమ పోస్ట్‌ పెయిడ్‌ వినియోగదారుల కోసం  బ్రహ్మాండమైన ఆఫర్‌ ప్రకటించింది.ఎయిర్‌ టెల్‌ టివి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వినియోగదారులకు  ఉచితంగా 60 జిబి డేటాను ఇవ్వనునట్లు పేర్కొంది.నెలకు 10 జిబి చొప్పున ఆరు నెలల పాటు ఈ ఆఫర్‌ వినియోగించుకోవచ్చని పేర్కొంది.ఇప్పటికే ఎయిర్‌టెల్‌ నెలకు 10 జిబి చొప్పున మూడు నెలల పాటు 30 జిబి డేటాను ఉచితంగా అందిస్తుంది.ఇప్పుడు దానిని 60 జిబికి పెంచింది.ఎయిర్‌టెల టివి యాప్‌ను  డౌన్‌లోడ్‌ చేసుకున్న ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు మాత్రమే ఈ ఉచిత డేటా లభిస్తుందని ఎయిర్‌ టెల్‌ పేర్కొంది.ఎయిర్‌టెల టివి యాప్‌ ద్వారా వినియోగదారులు లైవ్‌ టీవితో పాటు హుక్‌,సోనీ లిష్‌, యూట్యూబ్‌,డైలీ మోషన్‌ వీడియోలను వీక్షించవచ్చు.