ఎయిరిండియా సీఎండీగా నియమితులైన బన్సాల్‌

RAJIV BANSAL 1
RAJIV BANSAL

దిల్లీ: ఎయిరిండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌గా రాజీవ్‌ బన్సాల్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకూ ఛైర్మన్‌గా కొనసాగిన ఆశ్వని లోహనిని రైల్వే బోర్డు ఛైర్మన్‌గా నియమించడంతో ఆయన స్థానంలో బన్సాల్‌ను నియమించారు. ప్రస్తుతం బన్సాల్‌ పెట్రోలియం మంత్రిత్వ శాఖలో అడిషనల్‌ సెక్రటరీ, ఆర్థిక సలహాదారుడిగా బాధ్యతలు నిర్వహించారు. మూడ నెలలు లేదా తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు బన్సాల్‌ ఎయిరిండియా సీఎండిగా కొనసాగుతారు.