ఎయిరిండియా కొనుగోలుకు 3సంస్థలు రెడీ

AIRINDIA
AIRINDIA

న్యూఢిల్లీ: జెట్‌ఎయిర్‌వేస్‌, ఎయిర్‌ఫ్రాన్స్‌కెఎల్‌ఎం, డెల్టాఎయిర్‌లైన్స్‌మూడు సంఘటిత కూటమి ఎయిర్‌ఇండియాయకొనుగోలుకు ఆసక్తి చూపిసుత్నఆ్నయి.ఎయిర్‌ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణద్వారా ప్రభుత్వరంగ ఎయిర్‌లైన్స్‌కు జీవం పోయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉన్న సంగతి తెలిసిందే. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలోభాగంగా ప్రభుత్వం ఆసక్తి ఉన్న సంస్థలను బిడ్స్‌వేయాలని కోరింది. మొత్తంమూడు సంస్థల కూటమి ఇందుకు బిడ్డింగ్‌ వేయాలని చూస్తోంది. జెట్‌ఎయిర్‌వేస్‌ అధిపతి నరేష్‌ గోయాల్‌ ఆధ్వర్యంలోని సంస్థ ఎయిర్‌ఫ్రాన్స్‌ కెఎల్‌ఎం గ్రూప్‌తో సహకార ఒప్పందంచేసుకున్న నాలుగునెలలకే ఎయిర్‌ఇండియా కొనుగోలు జెవిలో చేరింది. డెల్టా ఎయిర్‌లైన్స్‌లో పదేళ్ల అనుభవం ఉన్న జెడ్‌ సిఇఒ విన§్‌ుదూబే గత ఏడాదే ఈ భారతీయ కెరీర్‌లో చేరారు. జెట్‌ఎయిర్‌వేస్‌లోనికి రాకముందు ఆయన అమెరికన్‌ ఎయిర్‌లైన్‌లో సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌గా పనిచేసారు. ఎయిర్‌ఫ్రాన్స్‌కెఎల్‌ఎం, తన భాగస్వాములు డెల్టా, అలిటాలియాలు సంయుక్తంగా ఇప్పటికే 270 రోజువారి విమానాలతో అట్లాంటిక్‌లో సర్వీసులు నడుపుతున్నాయి. ఎయిర్‌ఇండియా రుణభారంతో మగ్గుతున్నప్పటికీ ఈ ఎయిర్‌లైన్స్‌ కొనుగోలువల్ల ద్వైపాక్షిక హక్కుల కింద మరింత మనుగడ సాధించవచ్చని తేలింది. మంత్రుల బృందం ఎయిర్‌ఇండియా వాటా విక్రయానికి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తోంది. ఇండిగోనుంచి కూడా బిడ్‌ స్వీకరించే అవకాశం ఉంది. జెట్‌ ఎయిర్‌వేస్‌, ఎయిర్‌ఫ్రాన్స్‌గ్రూప్‌భాగస్వామ్యం గడచిన నవంబరులోనేప్రకటించారు. మొత్తం 106 యూరోపియన్‌ నగరాలు, 44 దేశీయ కేంద్రాలకు సర్వీసులు నడుస్తున్నాయి. అదేసమయంలో నరేష్‌ గోయల్‌ మాట్లాడుతూ ఎయిర్‌ఫ్రాన్స్‌,డెల్టా సంస్థల ఛైర్మన్‌లు ఇంధన జాయింట్‌కొనుగోళ్లకు సహకారం అందించేందుకు చర్చించాయి. అలాగే ఇంజనీరింగ్‌, నిర్వహణ వంటి వాటిలో కూడా జెవికి వస్తున్నాయన్నారు. ఎయిర్‌ ఇండియాను ప్రైవేటీకరణ ఈ ఏడాదిలోనే పూర్తిచేయాలని కేంద్రం భావిస్తోంది. ఎయిర్‌ఇండియా గ్రూప్‌లోని ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌, అనుబంధ సంస్థ ఐసాట్స్‌ రెండూ కలిపి ఒకసంస్థగా ఆఫర్‌చేస్తారు. ప్రాంతీయయసంస్థ అలయన్స్‌ఎయిర్‌ ప్రత్యేక సంస్థగా విక్రయిస్తారు. ఎయిర్‌ఇండియా ఎయిర్‌ట్రాన్స్‌పోఎర్టుసేవల సంస్థ, ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్‌ సేవల సంస్థలు వేరువేరుగా విక్రయిస్తారు. ఐసాట్స్‌లో 50ః50నిష్పతి జాయింట్‌ వెంచర్‌గా ఉంది. ఎయిర్‌ఇండియా, సింగపూర్‌ఎయిర్‌లైన్స్‌గ్రూప్‌ శాట్స్‌ నిర్వహిస్తోంది. గత ఏడాది ఏవియేషన్‌ సేవలు బుర్డ్‌గ్రూప్‌ కూడా ఎయిర్‌ఇండియాకు చెందిన ఎఐఎటిఎస్‌ఎల్‌సంస్థను కొనుగోలుకు ముందుకువచ్చింది. ఈనెల 6వ తేదీ పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ప్రకటనజారీచేస్తూ ఎయిర్‌ఇండియా నిర్వహణపరంగా కొంత మెరుగుదల నమోదుచేసిందని వెల్లడించింది. 2017 జూన్‌నెలలో ఆర్ధికవ్యవహారాల కేబినెట్‌ కమిటీ పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. సంస్థపై సుమారు రూ.50వేల కోట్లు రుణభారంతో మగ్గుతోంది. ఎయిర్‌ఇండియా ప్రత్యేకప్రత్యామ్నాయ మెకానిజం (ఐసామ్‌) కొన్ని ప్రత్యేక అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్వర్యంలో పరిశీలనచేస్తారు. యుపిఎ ప్రభుత్వం 2012లో ఈసంస్థకు బెయిల్‌ఔట్‌ ప్యాకేజి ప్రకటించింది. రూ.30,231కోట్లు 2021వరకూ అమలయ్యేవిధంగా ప్యాకేజినిప్రకటించింది. ఇప్పటివరకూ ప్రభుత్వం ఎయిర్‌ఇండియా గ్రూప్‌నకు రూ.26,545.21కోట్లు విడుదలచేసింది.