ఎయిమ్స్ నుంచి లాలూ డిశ్చార్జీ

న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జీ అయ్యారు. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ఆరోగ్యం క్షీణించడంతో రాంచీలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఎయిమ్స్‌కు రిఫర్ చేశారు. లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని, ఆయన ప్రయాణం చేయగల స్థితిలో ఉన్నారని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. ఐతే, తనను ఎయిమ్స్ నుంచి డిశ్చార్జీ చేసి రాంచీ ఆస్పత్రకిఇ తరలించవద్దని లాలూ కోరారు. కేవలం రాజకీయ దురద్ధేశంతోనే తనను రాంచీకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన అన్నారు. కాగా, నేడు కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎయిమ్స్‌కు వచ్చి లాలూను పరామర్శించారు. లాలూను డిశ్చార్జీ చేసి రాంజీ పంపవద్దని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది.