ఎయిమ్స్‌లో ఉద్యోగాలు

AIIMS, bhopal
AIIMS, bhopal

భోపాల్‌లోని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) – నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 700
పోస్టులవారీ ఖాళీలు: సీనియర్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌ 100, నర్సింగ్‌ ఆఫీసర్‌ 600
అర్హత: బిఎస్సీ (నర్సింగ్‌ / పోస్ట్‌ సర్టిఫికెట్‌ / నర్సింగ్‌ – పోస్ట్‌ బేసిక్‌ / ఆనర్స్‌ – నర్సింగ్‌) చేసుండాలి. కనీసం మూడేళ్లు స్టాఫ్‌ నర్స్‌గా పనిచేసి ఉండాలి. నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు డిప్లొమా (జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌ వైఫరీ) అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీనియర్‌ నర్సింగ్‌ ఆఫీసర్లకు మూడేళ్లు, నర్సింగ్‌ ఆఫీసర్లకు రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: పోస్టును అనుసరించి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ / ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.1000
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 6
వెబ్‌సైట్‌: www.aiimsbhopal.edu.in