ఎమ్మెల్సీగా గాలి స‌ర‌స్వ‌తి

G. Saraswathi
G. Saraswathi

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు మృతితో ఆ స్థానం ఖాళీ అయిన విషయంవిదిత‌మే. ఆ స్థానంలో ముద్దు కృష్ణమనాయుడు సతీమణి గాలి సరస్వతి ఏకగ్రీవంగా ఎన్నికవడం విదితమే. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ శాసనసభా భవనంలోని బీఏసీ సమావేశ మందిరంలో మండలి చైర్మన్ ఫరూక్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం, ఆమె మాట్లాడుతూ, పార్టీ అభ్యున్నతికి, కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. తన భర్త అడుగుజాడల్లో నడిచి పేద, బలహీనవర్గాల అభివృద్ధికి పాటుపడతానని అన్నారు.. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఙతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ రెడ్డి మాట్లాడుతూ, ముద్దుకృష్ణమనాయుడిలా పని చేసి పేరుతెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ప్రమణా స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, దొరబాబు, శాసనసభ్యురాలు సత్యప్రభ తదితరులు పాల్గొన్నారు.