ఎమ్మెల్యే వంశీ రాజీనామా కలకలం

Vallabhaneni Vamsi , MLA, Gannavaram
Vallabhaneni Vamsi , MLA, Gannavaram

ఎమ్మెల్యే వంశీ రాజీనామా కలకలం

విజయవాడ: కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మేల్యే వల్లభనేని వంశీమోహన్‌ రాజీనామా కలకలం అసెంబ్లీలో చోటు చేసు కుంది. గత కొంతకాలంగా డెల్టా షుగర్స్‌ సంస్ధ విషయంలో అధిష్టానంపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. డెల్టా షుగర్స్‌ విషయంలో ముఖ్య మంత్రి కార్యాలయం అధికారులు తన పట్ల అమ ర్యాదగా ప్రవర్తించారనే కారణంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆయన సీఎం ఆఫీసులో కన్నీటీ పర్యంత మవడంతో పాటు రాజీనామాకు సిద్ధపడ్డారు.

రాజీనామా లేఖను స్పీకర్‌ కోడెలకు సమర్పించేం దుకు ఆయన అసెంబ్లీకి వచ్చారు. దీంతో విషయం తెలుసుకున్న మరో ఎమ్మేల్యే బోడె ప్రసాద్‌ వల్లభనేని వంశీని నిలవరించి, ఆ రాజీనామా లేఖను చించేశారు.

వెంటనే ఈ విషయం మంత్రి నారా లోకేష్‌ దృష్టికి వెళ్లింది. దీంతో వంశిని బుజ్జగించే బాధ్యతను మంత్రి కళా వెంకట్రావ్‌కు అప్పగించారు. చెందిన హనుమాన్‌ జంక్షన్‌లో ఉన్న డెల్టా షుగర్స్‌ సంస్ధ గత నాలుగు నెలలుగా మూతపడింది. ఈ నేపధ్యంలో షుగర్‌ ఫ్యాక్టరీని ఇక్కడే ఉంచాలని, ఇక్కడ నుంచి తరలిస్తే ఎంతో మంది రైతులు తీవ్రగా నష్టపోతారని వంశీ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.

ఈరోజు కూడా ఈ విషయంపై చర్చించేందుకు రైతులతో కలిసి సీఎం కార్యాలయానికి వంశీవచ్చారు. అయితే, ఈ సందర్భంగా ఆయనతో సీఎం కార్యాలయం అధికారులు దురుసుగా ప్రవర్తించారు. సంబంధంలేని విషయంలో తలదుర్చొద్దంటూ దురుసుగా మాట్లాడారని ఎమ్మేల్యే వంశీ కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా ఒ ఉన్నతాధికారి సరైన రీతిలో వ్యవహరించలేదని, దీంతో వంశీ తీవ్ర మనస్తానికి లోనై, రాజీనామాకు సిద్ధమయ్యారు.