ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి ఈటల విందు

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి ఈటల విందు
హైదరాబాద్: రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందిన సందర్బంగా అన్ని పక్షాల ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీ లకు, ఆర్ధిక శాఖ అధికారులకు ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం సాయంత్రం జూబ్లీహాల్లో విందు ఇచ్చారు.ఈ విందుకు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హరీష్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ సిఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, బిజెఎల్పీ నేత డాక్టర్ లక్ష్మణ్ తదితరులంతా హాజ రయ్యారు. రాష్ట్ర గిరిజన సలహా మండలి ఏర్పాటు రాష్ట్ర గిరిజన సలహా మండలి ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన సంక్షేమ మంత్రి చందులాల్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. సభ్యులుగా సంబంధిత శాఖ అధికారులు, గిరిజన పార్లమెంట్ సభ్యులు, గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు. బెంగాల్ సిఎంతో టిఆర్ఎస్ ఎంపీల భేటీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని టిఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో కలిశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎంపీలు కవిత. కొత్త ప్రభాకర్‌రెడ్డి, బాల్క సుమన్ కలిసి పలు అంశాలపై చర్చించారు.