ఎమ్మెల్యే ఆళ్లకు రూ. 27 కోట్లు చెల్లించాలిః హైకోర్టు

 high court
high court

హైదరాబాద్: రూ. 27.44 కోట్లను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. సదావర్తి భూముల కొనుగోలుకు సంబంధించి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. భూముల కొనుగోలుకు చెల్లించిన రూ. 27.44 కోట్లను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి 15 రోజుల్లోగా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా… సదావర్తి సత్రం భూములు తమమే అంటూ తమిళనాడు ప్రభుత్వం పిటిషన్ వేసింది. దీనిపై 2వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖను హైకోర్టు ఆదేశిస్తూ… తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.