ఎమ్మెల్యె చింతమనేనిపై చంద్రబాబు ఆగ్రహం

Chandrababu

అమరావతి: పద్ధతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్‌ ఉంటుందని ఏపి సిఎం చంద్రబాబు ఎమ్మెల్యె చింతమనేని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గార్లమడుగు మాజీ సర్పంచ్‌ మీద దాడి ఘటనపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడంలేదని చింతమనేనిపై మండిపడ్డారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చింతమనేని తీరుపై పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించగా, ఒకరు చేసిన తప్పుకు అందరూ సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు.