ఎమ్మెల్యెలపై వేటు వేస్తేనే సమావేశాలకు వస్తాం: వైసీపీ

ysrcp flag
ysrcp

మరావతి: నేటి నుండి ఆంధ్రప్రదేశ్‌ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని, సమావేశాలకు హాజరవ్వాలని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీని కోరారు. దీనికి వైసీపీ ఎమ్మెల్యెలు .. చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. పార్టీ మార్చిన 22 మంది శాసనసభ్యులపై వెంటనే వేటు వేస్తేనే శాసనసభకు హాజవుతామని వారు అన్నారు. 22 మంది వైసీపీ ఎమ్మెల్యెలను మీపార్టీలో చేర్చుకున్నారు. వారిలో నలుగురిని మంత్రులుగా నియమించారు. దీనిని ఏప్రమాణాల ప్రకారమైనా శాసనసభ అంటారా? అని వారు ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యెలపై వేటు వేస్తేనే సభకు హాజరవుతామని వారు చెప్పారు.