ఎఫ్‌టిఐఐ చైర్మన్‌ పదవికి అనుపమ్‌ ఖేర్‌ రాజీనామా

anupam kher
anupam kher

ముంబై: ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టిఐఐ) చైర్మన్‌గా పదవికి ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ నేడు రాజీనామా చేశారు. ఓ కార్యక్రమం నిమిత్తం 2018-2019 మధ్య కాలంలో తొమ్మిది నెలలు యూఎస్‌లో ఉండాల్సి వస్తుందని ,అందుకే తీరిక లేకుండా ఉండటమే తన రాజీనామాకు కారణంగా ఆయన లేఖలో పేర్కొన్నారు. కావున తన బాధ్యతలకు న్యాయం చేయలేనందున రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి రాజవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌కు పంపించారు. ఆయన రాజీనామాను రాథోడ్‌ అంగీకరించారు. ఆయన సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు.