ఎప్ప‌డూ ఎన్నిక‌లు జ‌రిగిన 175 స్థానాలు గెలుస్తాంః మాగంటి

tdp mp maganti baby
mp maganti baby

ప.గోదావ‌రిః ఎంపీ మాగంటి బాబు శుక్రవారం ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా 175 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని, రాష్ర్టంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికే ప్రజలు పట్టం కడతారని తెలిపారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీకి రాకుండా ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు వ్యతిరేకిస్తారని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాష్ట్రాన్ని దోచేస్తే.. అమరావతి నిర్మాణం జరుగుతుందా? పోలవరం వస్తుందా? ఈ పనులు ఒక్క చంద్రబాబు వల్లే జరుగుతాయని, ఆ విషయం ప్రజలకు తెలుసునని చెప్పారు.