ఎప్పటికైనా నా గాడ్‌ఫాదర్‌ కెసిఆరే

 

Babu mohan
Babu mohan

సంగారెడ్డి: బీజేపీ నేత బాబుమోహన్‌ కంటతడి పెట్టారు. టీఆర్ఎస్ పార్టీ అందోల్ టికెట్ ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్‌ ఇవ్వకుండా కేసీఆర్‌ తన మెడ నరికారని వ్యాఖ్యానించారు. అసలు సీఎం ఇంట్లో పడుకున్నారని చెప్పారు. కాబోయే సీఎం మాత్రం కేటీఆరేనని వివరించారు. ఎప్పటికైనా తన గాడ్‌ఫాదర్ కేసీఆరేనని తెలిపారు. టీఆర్ఎస్‌లో ఏ రాయి ఎటునుంచి వచ్చినా హరీష్‌‌రావుకే తగులుతుందన్నారు. హరీష్‌రావు వల్లే టీఆర్ఎస్ బతికుందని చెప్పుకొచ్చారు. అందోల్ టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ ఓ బ్రోకర్‌ అంటూ బాబుమోహన్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ అందోల్ టికెట్ ఇవ్వకపోవడంతో ఇటీవల బాబుమోహన్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ తరపున ఆయన అందోల్‌లో పోటీచేయనున్నట్లు సమాచారం.