ఎపి హోదాపై అంతులేని వంచన

PM Modi
PM Modi

ఎపి హోదాపై అంతులేని వంచన

పోర్చుగల్‌ దేశానికి చెందిన వాస్కోడిగామా భారత దేశానికి దారి కనిపెట్టా డని మనం చదువ్ఞకున్నాం. వాస్కోడిగామాకు దారి చూపించి న బృందంలో ఒకగుజరాతీ కూడా ఉన్నాడన్న సంగతి ఈ మధ్యనే తెలిసింది. గుజరాతీలు వ్యాపార నిష్ణాతులని, హిందూ మహాసముద్రం ద్వారా అరేబియా, ఆఫ్రికా ఖండాలలో మొఘల్‌ సామ్రాజ్య కాలంలోనే సముద్ర వ్యాపారం చేసి ఎంత సంపాదిం చారో, ఎలా సంపాదించారో చరిత్రకారులు ఎక్కడైనా రికార్డు చేసి వ్ఞంటే తప్పనిసరిగా అధ్యయనం చేయాలి.

కానీ ఒకటైతే నిజం. మార్కెట్లు వెతికి పట్టుకోవడంలోనూ, విస్తరించడంలోనూ వారి పద్ధతే వేరనేది అమిత్‌షా, మోడీ ద్వయం దేశవ్యాప్తంగా విస్తరి స్తున్న తీరు చూస్తే అర్థం అవ్ఞతుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల చట్ట బద్ధమైన,న్యాయమైన హక్కులను కాలరాస్తూ నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వంచనకుపాల్పడి అసత్యాలను గోబెల్స్‌ మాదిరిగా చెబుతూ వచ్చింది. ప్రత్యేక హోదాను మించి ప్యాకేజీ రూపంలో ఆర్థికసహాయం ఇస్తామని నమ్మించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేశారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా14వ ఆర్థిక సంఘం ఆటంకమని కేంద్ర పాలకులు చెబుతూ వచ్చారు. ఇవన్నీ పచ్చి అసత్యాలని మార్చి 14న పార్లమెంట్‌ సాక్షిగానే తేలిపోయింది. రాజ్యసభలో తెలుగుదేశం సభ్యుడు సి.ఎం.రమేష్‌ అడిగిన ప్రశ్న కు కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావ్ఞ ఇంద్రజిత్‌ సింగ్‌ దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కట్టబెట్టవద్దని 14వ ఆర్థికసంఘం తన సిఫారసులో చెప్పలేదని సమాధానం ఇచ్చారు. కేంద్ర సాచి వేత వైఖరి, వితండవాదనలతో విసుగుచెందిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌డిఎ నుండి బయటకు వచ్చేసి బిజెపి అప్రజాస్వామిక, మోస కారి విధానాలను ఎండగట్టడం ప్రారంభించింది.

ప్రత్యేకహోదా సాధన,విభజన హామీలసంగతి, వామపక్షాలు చేస్తున్న ప్రజాం దోళన కార్యక్రమాలు కూడా జోరు అందుకున్నాయి. మార్చి 23న రాష్ట్రంలో జరిగిన జాతీయ రహదారుల దిగ్బంధనానికి తెలుగు దేశం మద్దతు పలికింది. న్యాయబద్ధమైన హక్కులసాధన కోసం నిలబడిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై బిజెపి ఎదురుదాడులకు దిగ డం హేయమైన చర్య. ప్రత్యేకహోదా అనేది కేవలం ఐదు అక్షరా ల పదంకాదు. ఇది ఐదు కోట్ల ఆంధ్రప్రజల ఆత్మగౌరవ సంకేతం. బిజెపి మోసకారి ఎత్తుగడలను ఎండగట్టాలనే ఉద్దేశ్యంతో తెలు గుదేశం, ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సిపి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి.

తెలుగుదేశం అవిశ్వాసం ప్రవేశపెట్టగానే దేశవ్యాప్తంగా కదలిక వచ్చింది. రాజకీయ పున రేకీకరణ జరిగే అవకాశంఏర్పడింది.అన్నాడిఎంకె, టిఆర్‌ఎస్‌ పార్టీ లు వెల్‌ దగ్గరకు వచ్చి చేస్తున్న ఆందోళన వలన అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్న వారి సంఖ్య లెక్కించలేకపోతున్నాననే సాకుతో లోక్‌సభ స్పీకర్‌సుమిత్రా మహాజన్‌ సభను వాయిదా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజనరోజున 111మంది వెల్‌లో వ్ఞన్నారు. అయి నా లెక్కపెట్టి కాంగ్రెస్‌, వారికి మద్దతుగా బిజెపి నిలిచి విభజన బిల్లు పాస్‌ చేయించిన వైనం ప్రజలు మర్చి పోయారనుకుంటే అదిబిజెపి భ్రమమాత్రమే అవ్ఞతుంది.కాంగ్రెస్‌ కలిగించిన విభజన ఘాతం కంటే ఎక్కువగా బిజెపి ఘోరమైన మోసం చేసిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు భావిస్తున్నారు.2014 ఫిబ్రవరిలో పార్లమెం ట్‌లో చెప్పిన అంశాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రజలు కోరు తుండగా ఆ విషయం తప్పించి మిగతా అన్నీ బిజెపి నాయకులు మాట్లాడుతున్నారు.

విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలు, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చినప్రత్యేకహోదా హామీని అమలు చేయ కుండా అన్యాయం చేసింది చాలక, తెలుగు ప్రజల మీద పెత్తనం చేసే ప్రయత్నాలు గర్హనీయం. ఇచ్చిన నిధులు ఎలా వినియోగిం చాలో తెలిసే సర్టిఫికేట్‌ ఇవ్వలేదని అందువల్లనే నిధులు కేటా యించలేదని రాష్ట్ర ప్రభుత్వంపై అభాండాలు వేయడం నిరంత రం ధర్మపన్నాలు పలికే బిజెపికే చెల్లింది. పోలవరం ప్రాజెక్టులో నిధుల వినియోగంపై విచారణకు కేంద్ర ప్రభుత్వం నియమించిన మసూద్‌ కమిటీ పోలవరం నిర్మాణంలో ఎక్కడా నిధుల దుర్విని యోగం లేదని నివేదిక ఇవ్వడం బిజెపికి, ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సిపికి చెంపపెట్టు. ఒకపక్క లోక్‌సభలో అవిశ్వాసం, మరోవైపు మోడీపై విశ్వాసంతో ద్వంద వైఖరి అవలంభిస్తూ ప్రత్యేక హోదా ఎలా సాధిస్తారో ప్రతిపక్ష నేత జగన్‌నే చెప్పాలి. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఇప్పటి వరకు ఇచ్చిన నిధులు రూ. 5,364 కోట్లు.

పోలవం నిర్వాసితులకు పునరావా సానికి రూ.33వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నూతన రాజధాని అమరావతి నిర్మాణ బాధ్యత తనదే అనిచెప్పిన కేంద్ర ప్రభుత్వం కేటాయించింది రూ. 3,500 కోట్లు మాత్రమే. కానీ విడుదల చేసింది రూ.1000 కోట్లు మాత్ర మే.ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్లు ఆర్థికసంఘం మనరాష్ట్రానికి ఇచ్చి నవి కూడా కేంద్రమే ప్రత్యేకంగా ఇచ్చినట్లు గొప్పలు చెబు తుంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోకేంద్ర విద్యాసంస్థలు ఏర్పాటుకు ఇచ్చిన హామీలపై మార్చి 23న రాష్ట్రఅసెంబ్లీలో జరిగిన చర్చలో కేంద్ర ప్రభుత్వం అలసత్వాన్ని సభ్యులు ఎలా ఎండగట్టారో ప్రజ లుచూశారు.

కేంద్ర విద్యాసంస్థలకు రూ.11,762 కోట్లురా వాల్సి ఉండగానాలుగేళ్లలో రూ.576కోట్లు కేటాయించారు.కానీ విడుదల చేసింది రూ.119.34కోట్లు మాత్రమే. ఇలా అయితే కేంద్ర విద్యా సంస్థల నిర్మాణాలు పూర్తికావడానికి 30ఏళ్లకు పైగా పడుతుంది. ప్రత్యేకహోదా కోసం, విభజన చట్టం హామీల సాధన కోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా సమైక్యంగా ఉద్యమిస్తుంటే కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నది. ఇందుకు నిదర్శనం అసంబద్ధ వాదనలతో అవాస్తవాలతో భారతీ య జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్‌షా మార్చి 23న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాసిన లేఖ నిదర్శనం.

కేంద్రంలో బిజెపి పూర్తి ఆధిక్యతతో అధికారంలోకి వచ్చిన తర్వా త బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, గవర్నర్‌లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌లు నియమితులయ్యారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలితో రాజ్యాంగంప్రమాదంలో పడింది. చట్ట సభల్లో ప్రత్యేక హోదా అంశంపై ప్రతిష్ఠంభనఏర్పడింది. రాజ్యాం గంతోపాటు రాజ్యవ్యవస్థలు ముఖ్యంగా పార్లమెంట్‌ ఔన్నత్యం బిజెపిద్వారా విస్మరణకు గురవ్ఞతుంది. ఇది చాలా ఆందోళన కలి గించేస్థితి.ఎలాంటి చర్చలు, సంప్రదింపులు, లోటుపాట్లు సవరణ లేకుండానే ఆర్థిక బిల్లులు ద్రవ్యబిల్లుగా పుట్టుకొచ్చి రాజ్యసభ, పరిశీలన,ఆమోదం లేకుండానే బిల్లులుగా చెలామణిలోకి వస్తున్నా యి.1952లో పార్లమెంట్‌ ప్రస్థానం మొదలైన తరువాత ఇలాంటి అవాంఛనీయ వైపరీత్యాన్ని ఎన్నడూ చూడలేదు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై అవిశ్వాసాన్ని అడ్డుకుంటూ తమ సమస్యలపై వెల్‌లోకివచ్చి నినదిస్తున్న సభ్యులతో సభాసమయంలో కాకుండా విడిగా ప్రభుత్వం చర్చించి, న్యాయమైన వాటిని పరిష్కరించే బాధ్యతను కేంద్ర పాలకులు గాలికి వదిలివేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత లోక్‌సభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఇది 27వ సారి. సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ చర్చకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుందో బిజెపి పెద్దలే చెప్పాలి.

చట్టసభల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం, అందునా ప్రభుత్వానికి నాయకత్వం వహించే ప్రధాని మోడీ మౌనం దాల్చ డం సరైనదికాదు. బిజెపి అమిత్‌షా బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలను, ప్రధానమంత్రి తెంపరితనాన్ని, అసహనాన్ని దేశవ్యాప్తంగా ప్రజ లు గమనిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంతగా దగా చేస్తు న్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రజాసంక్షేమానికి తనదైన రీతిలో బాటలు వేస్తూనే ఉన్నారు.1.41కోట్ల తెల్లరేషన్‌ కార్డులు19 లక్షల మంది డ్వాక్రా మహిళలు, 59 లక్షల మంది రుణమాఫీ పొందిన రైతులు, 48 లక్షల మంది ఎన్‌టిఆర్‌ భరోసా పెన్షన్లు అందిస్త్తూ తెలుగుదేశం సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది.

అదే కేంద్ర ప్రభు త్వం గడచిన 43 నెలల్లో ఏ వర్గానికి చేసిన వాగ్దానం నెరవేర్చే ప్రయత్నాలు చేయలేదు. ప్రధానంగా దేశంలో ఉత్పాదకరంగం పూర్తిగా దెబ్బతినిపోయింది. అత్యధికంగా ఉపాధికల్పించే రంగాలు స్తబ్దతలో పడితే చర్య లు తీసుకోవడం లేదు. గుజరాత్‌ ముఖ్య మంత్రిగా మోడీ ఉన్న సమయంలో 25 వేలకోట్లరూపాయల పనుల్లో అక్రమాలు జరిగా యని 2014 జూలైలో కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తప్పు పట్టి సిబిఐ విచారణ జరపాలని ఆదేశించింది.

దీనిపై అతీ గతీ లేదు గానీ బిజెపి నయవం చన గ్రహించి తట్టుకోలేక రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేకహోదా, విభజన హామీ ల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీయగానే బెదిరింపు రాజకీయాలకు బిజెపి పాల్పడటం ఆ పార్టీ దివాలా కోరు రాజకీ యానికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం వంచన, అసత్యాలకు ఎటువంటి రుజువ్ఞలు ఇక అక్కర్లేదు. రాష్ట్ర ప్రజలంతా పార్టీ విభేదాలు వదిలి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి కేంద్రం నుంచి ప్రత్యేకహోదా, విభజన హామీలు సాధించుకోవాలి. బిజెపి కేంద్ర నాయకులు కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి రాజ్యాంగాన్ని గౌరవిస్తారో, చరిత్ర హీనులవ్ఞతారో తేల్చుకోవాల్సిన తరుణమిది.

– పోతుల సునీత, ఎమ్మెల్సీ, రాష్ట్రకార్యదర్శి, తెదేపా