ఎపి నుంచి 9మంది ఉత్తమ ఉపాధ్యాయులు

Teacher's Day
Teacher’s Day

ఎపి నుంచి 9మంది ఉత్తమ ఉపాధ్యాయులు

ఢిల్లి:  విజ్ఞాన్‌ భవన్‌లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేశారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9 మంది ఉపాధ్యాయులు ఈ అవార్డును అందుకున్నారు. గుంటూరు జిల్లా కాకనూరుకు చెందిన గోరంట్ల శ్రీనివాసరావు, మనుకొండవారిపాలెంకు చెందిన చాగంటి శ్రీనివాసరావు, తూ.గో. జిల్లా కడియంకు చెందిన చిలుకూరి శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా పాములపాడుకు చెందిన విమలకుమారి, విశాఖ జిల్లా మారేడుపూడికి చెందిన ఎర్ర చక్తవర్తి, యాడాడ ప్రాథమిక పాఠశాలకు చెందిన గొట్టేటి రవి, విజయనగరం జి.సి.పెంటకు చెందిన బోట్లకోటి శంకరరావు, ప.గో జిల్లా చాగల్లుకు చెందిన ధర్మరాజు, తేజంపూడికి చెందిన లోకానందరెడ్డిలు అవార్డులందుకున్నవారిలో ఉన్నారు.