ఎపిలో టెన్త్ పరీక్ష ఫీజు గడువు 18 వరకు పెంపు
హైదరాబాద్ : ఎపిలో మార్చిలో నిర్వహించనున్న టెన్త్ పబ్లిక్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష ఫీజు గడువును ఎస్ఎస్సి బోర్డు మరోసారి పొడిగించింది. తత్కాల్ స్కీంకింద రూ. వెయ్యి లేట్ ఫీజుతో 18వ తేదీ వరకు ఈ పరీక్ష ఫీజు చెల్లింపుకు అవకాశం కల్పించింది. ఇది అఖరి అవకాశమని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని బోర్డు డైరెక్టర్ ఎమ్మార్ ప్రసన్నకుమార్ కోరారు.