ఎపికి చేరిన రూ.2,420 కోట్ల నగదు

Cash Released to AP
RBI given Cash for AP

ఎపికి చేరిన రూ.2,420 కోట్ల నగదు

అమరావతి: రాష్ట్రానికి ఆర్‌బిఐ నుంచి రూ.2,420 కోట్ల నగదు చేరింది. ఎపి సిఎం చంద్రబాబు ఆర్‌బిఐ గవర్నర్‌తో మాట్లాడి ఈ సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు రాష్ట్రానికి తక్షణమే నగదు పంపాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే.. ఈమేకు ఆర్‌బిఐ ప్రత్యేక విమానాల ద్వారా పంపిన నగదు విశాఖ, తిరుపతి నగరాలకు చేరింది.. అక్కడి నుంచి రాష్ట్రాంలోని అన్ని ప్రాంతాలకు ఆ నగదును చేర్చేందుకు ఎపి సర్కార్‌ అన్ని ఏర్పాట్లుచేసింది.. నగదు అవసరాలు ఎక్కువగా ఉన్న జిల్లాలకు రూ.240 కోట్లు, ఒకింత తక్కువగా ఉన్న జిల్లాలకు రూ.160 కోట్లు పంపుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.