ఎపికి ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు

NHRC
NHRC

న్యూఢిల్లీః ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీచేసింది. విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో వసతుల లేమితో ప్రాణాలు కోల్పోవడంపై నోటీసులు జారీ చేసింది. రహదారులు, వైద్య సదుపాయాల్లేక గిరిజనులు ప్రాణాలు కోల్పోవడంపై నోటీసులు పంపింది. మీడియా కథనాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుంది. నాలుగు వారాల్లో సమాధానం తెలపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. గర్భణిని అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లేందుకు గ్రామస్తులతో కలిసి 12కిలోమీటర్లు భర్త మోసుకెళ్లాడు. మార్గమధ్యంలో మహిళ ప్రసవించగా, శిశువు మృతిచెందాడు. జరిగిన ఘటన నిజమైతే మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కమిషన్ తెలిపింది. ఏడాదిలో జరిగిన ఇలాంటి ఘటనలు, తీసుకున్న చర్యలపై వివరాలు అందజేయాలని ఆదేశించింది. బాధితురాలికి అందిన వైద్యసదుపాయం, పరిహారం వివరాలు అందజేయాలని ఆదేశించారు.