ఎన్‌సిఎల్‌టి కేసులతో రూ.లక్షకోట్ల బాకీలకు మోక్షం!

BANKS
BANKS

న్యూఢిల్లీ: భూషన్‌ స్టీల్‌ టేకోవర్‌ కేసుపూర్తికావడంతో బ్యాంకుల్లో పెరుగుతున్న నిరర్ధక ఆస్తుల్లో సుమారు లక్ష కోట్ల రూపాయలవరకూ రికవరీచేయగలమని ఆర్ధికశాఖ అంచనావేస్తోంది. మొత్తం 12 నిరర్ధక ఆస్తుల కేసులను రిజర్వుబ్యాంకు దివాలా కోర్టుకు నివేదించాలని బ్యాంకర్లకు సూచించడంతో ప్రస్తుతం ఒకదాని వెంట ఒకటి 12కేసులు పరిష్కారదిశగా కదులుతున్నాయి. గత వారంలో టాటాగ్రూప్‌ మొత్తం 72.65శాతం రుణపీడిత భూషణ్‌ స్టీల్‌ కంపెనీ వాటాను రూ.36వేల కోట్లకు కొనుగోలుచేసింది. దీనితో రుణాలిచ్చిన బ్యాంకర్లకు కొంత లాభదాయకత పెరుగుతుందని అంచనా. మిగిలిన 11 నిరర్ధకాస్తులనుసైతం రికవరీచేయవచ్చని సుమారు లక్ష కోట్ల రూపాయలు రుణాల రికవరీ కాగలవని దివాటాచట్టంపరిధిలోనే వీటిని పరిష్కరించగలమన్న భావనకు ఆర్‌బిఐ వచ్చింది. ఈ చర్యలకారణంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు మరింత తగ్గుతాయి. గత ఏడాది జూన్‌లో ఆర్‌బిఐ అంతర్గత సలహా కమిటీ మొత్తం 12 ఖాతాలను గుర్తించింది. ఇవన్నీకూడా రూ.5వేల కోట్లకుపైబడి బకాయిలున్నకేసులే. మొత్తం మొండిబకాయిల్లో 25శాతంవాటాతటోఉన్నాయి. ఆర్‌బిఐ సలహాలను అనుసరించి బ్యాంకులు భూషణ్‌స్టీల్‌, భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌, ఎస్సార్‌ స్టీల్‌, జూనీ ఇన్‌ఫ్రాటెక్‌, ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌, మన్నెట్‌ ఇస్పాట్‌ ఎనర్జీ, జ్యోతిస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌; ఎలక్ట్రోస్టీల్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌, ఆమ్‌టెక్‌ ఆటోలిమిటెడ్‌; ఎరా ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, ఎబిజి షిప్‌యార్డు కంపెనీలను ఎన్‌సిఎల్‌టికి నివేదించాయి. ఈ కంపెనీలన్నీ సుమారు రూ.1.75 లక్షలకోట్లు బకాయిలున్నాయి. కోల్‌కత్తా ఎన్‌సిఎల్‌టి బెంచ్‌ ఇప్పటికే వేదాంత రీసోర్సెస్‌ ఎలక్ట్రోస్టీల్‌ప్లాట్స్‌ కొనుగోలుకు అనుమతించింది. ఎన్‌సిఎల్‌టి గతనెలలో భూషన్‌ పవర్‌స్టీల్‌ కంపెనీని బ్రిటన్‌ కేంద్రంగా ఉన్న లిబర్టీ హౌస్‌ కొనుగోలుకుఅనుమతించింది. భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ రూ.48వేల కోట్లు బ్యాంకులకు బకాయి పడింది. పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు ఈ కేసును ఎన్‌సిఎల్‌టికి నివేదించింది. గతవారంలోనే బమ్నిపాల్‌స్టీల్‌ కంపెనీ అంటే టాటా అనుబంధ సంస్థ 72.65శాతం భూషన్‌ స్టీల్‌ వాటాలను కొనుగలుచేసింది. 36,400 కోట్లు వెచ్చించింది. ఈమొత్తంలో రూ.35,200 కోట్లు ఆర్ధికరంగపరంగా రుణదాతలకు అంటే బ్యాంకర్లకు చెల్లిస్తుంది. ఈకొనుగోలుతో పంజాబ్‌నేషనల్‌ బ్యాంకుకు కొంత రానిబాకీలభారం తగ్గుతుందని అంచనా. భూషణ్‌స్టీల్‌కు అత్యధికంగా రుణాలిచ్చిన బ్యాంకుల్లో రెండో బ్యాంకుగా నిలిచింది. ఈకంపెనీకి 3857.49 కోట్లు రుణాలిస్తేరుణకేటాయింపులకింద బ్యాంకు 1542.99 కోట్లు కేటాయించింది. ఇక ఎన్‌షిఎల్‌టి పరిష్కారంతో పిఎన్‌బి ఎన్‌పిఎలు రూ.3857 కోట్లకు తగ్గాయి. బ్యాంకు రూ.3050 కోట్లు రికవరీచేస్తుంది. అలాగే 807.49 కోట్లు కేటాయింపులనుంచి రద్దుచేస్తుందని అంచనా. మరొక ప్రభుత్వరంగ బ్యాంకరు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సైతం రూ.1993 కోట్లు ఎన్‌సిఎల్‌టిపరిష్కారంతో భూషణ్‌స్టీల్‌కు ఇచ్చినరుణం రికవరీ చేసుకోగలుగుతున్నది.