ఎన్‌డిబి నుంచి రూపాయి, రూబుల్‌ బాండ్లు

BRICS11
BRICS Summit

ఎన్‌డిబి నుంచి రూపాయి, రూబుల్‌ బాండ్లు

న్యూఢిల్లీ, అక్టోబరు 14: చైనా కరెన్సీలో మూడు బిలియన్‌ యువాన్‌ల బాండ్లను జారీచేసి విజయవంతం అయిన తర్వాత బ్రిక్స్‌దేశాల న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఎన్‌డిబి) తాజాగా రూపాయి, రూబుల్‌ ఆధా రిత బాండ్లను జారీచేసేందుకు సిద్ధం అవుతోంది. బ్యాంకు ఉపాధ్యక్షుడు సిఒఒ గ్జియాన్‌ ఝు ఈ అంశం వెల్లడించారు. బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరమ్‌ సదస్సులో గ్జియాన్‌ మాట్లాడుతూ ఇందుకుసంబంధించి కసరత్తు లు జరుగుతున్నాయని భారత్‌, రష్యాల నుంచి బ్యాంకు సూత్రప్రాయంగా అనుమతులు సాధించిందని చెప్పారు. ఈ బాండ్లద్వారా వచ్చిన నిధులను దీర్ఘకాలిక ఇన్‌ప్రా బాండ్లకు ఉపకరిస్తాయని చెపుతోంది. బ్రిక్స్‌బ్యాంకుగా ప్రాచుర్యం పొందిన ఎన్‌డిబి గతంలో అంతర్జాతీయంగా స్వఛ్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకోసం బాండ్లు జారీ చేసింది. యువాన్‌ కరెన్సీ గ్రీనబాండ్లను చైనా ఇంటర్‌బ్యాంక్‌ మార్కెట్‌లో గడచిన జూలైలోనే జారీచేసింది.ఐదేళ్లకాలపరిమితి కలిగిన ఈ బాండ్లు 40మందికిపైగా దేశీ య, అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షించాయి. వచ్చే ఆరునెలల్లో ఎన్‌డిబి మరో పదిబిలియన్‌ యువాన్‌ల గ్రీన్‌బాండ్లు జారీచేసేందుకు నిర్ణయించింది. బ్రిక్స్‌దేశాలు కాకుండా ఇతర దేశాల్లోని ప్రాజెక్టులకు బ్యాంకు ఆర్ధికసాయం అందిస్తే మరికొంతపరిధి పెరుగుతుందని అంచనావేస్తోంది. కొత్తకొత్త భాగస్వాములను అన్వేషిస్తోంది. రానున్నరోజుల్లో ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో కూడా కలిసి పనిచేస్తామని బ్రిక్స్‌ బ్యాంకు చెపుతోంది. ఎన్‌డిబి చైనా, రష్యా, బ్రెజిల్‌, భారత్‌, దక్షిణాఫ్రికాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. 2014 జూలైలో ఏర్పాటయిన ఈ బ్యాంకు ఏడాది తర్వాత కార్యకలాపాలు ప్రారంభించింది. షాంఘై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. 100 బిలియన్‌ డాలర్ల అధీకృత మూలధనంతో ప్రారంభం అయిన ఈ బ్యాంకు వర్ధమాన దేశాల్లో ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు రుణపరపతిని అందిస్తోంది.