ఎన్‌టీఎస్ఈకు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

NTSE 2018
NTSE 2018

హైదరాబాద్ః నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామ్‌(ఎన్‌టీఎస్ఈ) రాసేందుకు పదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మేడ్చల్‌ డీఈఓ విజయకుమారి తెలిపారు. గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, కేవీ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. రూ.100లు పరీక్ష రుసుము చెల్లించి, http// bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్‌ నాలుగన పరీక్ష ఉంటుందని తెలిపారు. కులం సర్టిఫికెట్‌తోపాటు దివ్యాంగులు మెడికల్‌ సర్టిఫికెట్లను జతపర్చాలని పేర్కొన్నారు.