ఎన్‌జిటి అడహాక్‌ చైర్‌పర్సన్‌గా రహీమ్‌

JAVAD RAHEEM
JAVAD RAHEEM

న్యూఢిల్లీ: ఎన్‌జిటి తాత్కాలిక చైర్‌పర్సన్‌గా కర్ణాటక హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జావద్‌ రహీమ్‌ నియామకమయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఖాన్‌ విల్కర్‌ , చంద్రచూడ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం జావద్‌ రహీమ్‌ను ఎన్‌జిటి తాత్కాలిక చైర్‌పర్సన్‌గా నియమించింది. ఎన్‌జిటి బార్‌ అసోసియేషన్‌ అభ్యర్దన మేరకు జావద్‌ రహీమ్‌ నియమితులయ్యారు.