ఎన్‌కౌంటర్‌లో మావో మృతి

Maoist
Maoist

రాంచీ: జార్ఖండ్‌లో లతేహార్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో నిన్న భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మరో మావోను అరెస్టు చేశారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నారు. భారీగా బుల్లెట్లు, మందుగుండు సామాగ్రి లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.