ఎన్‌ఐఏ కోర్టును ఆశ్రయించిన ఎన్‌ఐఏ

NIA
NIA

అమరావతి: ఏపిలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై కోడికత్తితో హత్యాయత్నం చేసిన కేసును దర్యాప్తు చేసేందుకు వచ్చిన ఎన్‌ఐఏ బృందానికి ఏపి పోలీసులు సహకరించడంలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు సోమవారం విశాఖకు చేరుకున్నారు. కేసు దర్యాప్తులో ఏపి పోలీసులు సహకరించడం లేదని, పూర్తి వివరాలు అందించడంలేదని ఎన్‌ఐఏ అధికారులు మంగళవారం ఎన్‌ఐఏ కోర్టును ఆశ్రయించారు. హత్యాయత్నం కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఇప్పించాలని, ఈ కేసును విజయవాడ కోర్టుకు బదలాయించాలని కోరారు.