ఎన్‌ఐఎ ఆఫీసర్‌ పాత్రలో రాజశేఖర్‌

RAJASEKHAR
RAJASEKHAR

ఎన్‌ఐఎ ఆఫీసర్‌ పాత్రలో రాజశేఖర్‌

సమాజంలో అంతర్గతంగా జరుగున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అరికట్టటానికి భారత ప్రభుత్వం చేత, స్థాపించబడ్డ సంస్థ ఎన్‌ఐఎ నేషనల్‌ ఇన్విష్టిగేషన్‌ ఏజన్సీ 2008లో స్థాపించబడింది. పోలీస్‌, పారా మిలటరీ, సిబిఐ వీటితో పాటు ఎన్‌ఐఎ అనే ఒక ఇన్విష్టిగేషన్‌ నిఘా సంస్థ ప్రజా శ్రేయస్సుకై ఏర్పడింది. యాంటీసోషల్‌ యాక్టివిటీ అనగానే ముందుగా గుర్తుచ్చేది. ఉగ్రవాదం అంటే అభం శుభం తెలియని ప్రజల్ని చంపడం మాత్రమే కాదు. యువతను పెడదోవ పట్టించడం, పది మందితో కలిసి ప్రజల్ని భయపెట్టడం, మారక ద్రవ్యాలని పరాయి దేశం నుంచి తెచ్చి మన దేశం లోని సంపదను అక్కడికి తరలించడం ఇలాంటి కార్యకలాపాలు అన్ని ఉగ్రవాదంలోని భాగమే అటువంటి అతీతశక్తుల్ని సమాజం నుంచి బహిష్కరించడమే ఎన్‌ఐఎ ధ్యేయం. సరిగ్గా ఇటువంటి పారతలో పిఎస్‌వి గరుడమేగ 126.18ఎం. సినిమాలో డా.రాజశేఖర్‌ ఎన్‌ఐఎ ఆఫీసర్‌, శేఖర్‌ పాత్రలో కనిపించబోతున్నారు. తనకు సహచరులుగా రవివర్మ, చరణ్‌ దీప్‌లు చేస్తున్నారు.న ఒక గుండె బలానికి బుద్ధిబల, కండబలం తోడైతే ఆ జట్టు ఎంత పటిష్టంగా ఉంటుందో అలా సాంకేతిక బలంతో రవివర్మ, కండ బలంతో చరణ్‌ దీప్‌లు రాజశేఖర్‌కి కుడి ఎడమ భుజాల్ల వ్యవహరిస్తారు.

ఎన్నో సవాళ్లు, ప్రతి సవాళ్లుతో కూడుకున్న ఆఫీసర్‌ శేఖర్‌కి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసే పై ఆఫీసర్‌ స్థానంలో నాజర్‌, కొంచెం ఇంటికి లేటుగా వచ్చిన తను చెప్పిన పని చేయకపోయిన అలిగి కోపగించుకొనే భార్యగా పూజా కుమార్‌ మరోవైపు. వీరి ఇద్దరి మధ్య ఛాలెంజ్‌తో కూడుకున్న ఉద్యోగం అటువంటి పరిస్థితులలో ఉన్నా శేఖర్‌ కుటుంబాన్ని ఉద్యోగాన్ని సమంగా చేస్తూ కుటుంబంలో చిన్న చిన్న కలహాల్ని ఎదుర్కొంటూ ఒత్తిడిని సైతం లెక్క చేయకుండా తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాడు తన మిషన్నీ ఎంతటి వేగంతో పరిగెత్తించాడు అనేది కథాంశం..! స్వతహాగా రాజశేఖర్‌ అంటేనే పోలీస్‌ పాత్రల్లో ఇమిడి పోయే స్వభావం ఉన్నా యాక్టర్‌. ఈ ఎన్‌ఐఎ క్యారెక్టర్‌ని ఛాలెంజింగ్‌ తీసుకొని చేసుంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. తనకు ఎదురైనా సవాళ్ళను ఎలా అదిరోహించాడు అనేది తెరపైన చూద్దాం. రాజశేఖర్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పూజా కుమార్‌ గృమిని పాత్రలో నటిస్తుంది. జార్జ్‌ అనే కరుగుగట్టిన విలన్‌ పాత్రలో కిషోర్‌ సహా నాజర్‌, జర్నలిస్ట్‌ పాత్రలో శ్రద్ధాదాస్‌, పోసాని కృష్ణమురళి, అలీ, పృథ్వీ, షాయాజీ షిండే, అవసరాల శ్రీనివాస్‌, శత్రు, సంజ§్‌ు స్వరూప్‌, రవివర్మ, ఆదర్శ్‌, చరణ్‌ దీప్‌, రవిరాజ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి క్యాస్ట్యూమ్స్‌్‌ టిల్లి బిల్లి రాము, మేకఫ్‌: ప్రశాంత్‌, ప్రొడక్షన్‌ మేనేజర్స్‌: శ్రీనివాసరావ్ఞ పలాటి, సాయి శివన్‌ జంపన, లైన్‌ ప్రొడ్యూసర్‌: మురళి శ్రీనివాస్‌, కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌: బాబీ అంగార, సౌండ్‌ డిజైన్‌: విష్ణు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌ వైజన్‌: సి.వి.రావ్‌, స్టంట్స్‌: సతీష్‌, నుంగ్‌, డేవిడ్‌ కుబువా, కొరియోగ్రాఫర్‌: విష్ణుదేవా, ఎడిటర్‌: ధర్మేంద్ర కాకరాల, రచన: ప్రవీన సత్తారు, నిరంజన్‌ రామిరెడ్డి, బ్యాక్‌గ్రాండ్‌ స్కోర్‌: శ్రీచరణ్‌ పాకాల, సమర్పణ: శివాని శివాత్మిక ఫిలింస్‌, నిర్మాణం: జ్యో స్టార్‌ ఎంటర్‌ప్రైజస్‌, ఆర్ట్‌: శ్రీకాంత్‌ రామిశెట్టి, సినిమాటోగ్రఫీ: అంజి, సురేష్‌ రగుతు, శ్యామ్‌ ప్రసాద్‌, గికా, బాకుర్‌, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, శ్రీచరణ్‌ పాకాల, ప్రొడ్యూసర్‌: ఎం.కోటేశ్వర్‌ రాజు, కథ, కథనం, దర్శకత్వం: ప్రవీణ్‌ సత్తారు.