ఎన్ఎండిసికి మరో ప్రతిష్టాత్మకమైన పిఆర్ఎస్ఐ అవార్డులు

హైదరాబాద్: ఎన్ఎండిసికి ప్రతిష్టాత్మకమైన నాలుగు అవార్డులు లభించాయి. దేశంలో ఐఆర్ ఓఆర్ను ఉత్పిత్తి చేయడంలో ఎన్ఎండిసికి పేరుంది. డెహరాడూన్లో పబ్లిక్ రిలేషన్ సోసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 40వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్ కాన్ఫరెన్సు(పిఆర్ఎస్ఐ) జరిగింది. ఈ కార్యక్రమంలో నాలుగు అవార్డులు ఎన్ఎండిసి సొంతం చేసుకుంది. కార్పోరేట్ సోషల్ సస్టెనిబిలిటి రిపోర్టు, సిఎస్ఆర్ ప్రాజెక్టు ఆఫ్ ఉమెన్ ఎంపోర్మెంట్, బెస్ పిఎస్యు ఆర్గనైజేషన్ అండ్ కార్పోరేట్ ఫిల్మ్ కేటగిరిలలో అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులను ఉత్తరఖాండ్ ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్ రావత్ చేతుల మీదుగా కార్పోరేట్ కమ్యునికేషన్ డిజిఎం జయప్రకాష్ అందుకున్నారు.