ఎన్‌ఆర్‌ఐకు కీలక పదవి

barnavaal
barnavaal

వాషింగ్టన్‌: అమెరికాలో మరో ఎన్‌ఆర్‌ఐకు కీలక పదవి దక్కింది. రిటా బర న్వాల్‌ అనే ఎన్‌ఆర్‌ఐకు ఎనర్జీ విభాగంలో అణుశక్తిశాఖ అసిస్టెంట్‌ సెక్రెటరీగా నియమించారు. ఈమెను స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ఎంపిక చేయడం విశేషం. అమెరికా ఆధునిక అణు రియాక్టర్ల అభివృద్ధిని వేగవంతం చేయాలని నిర్ణయించిన కొద్దిరోజుల్లోనే ట్రంప్‌ చర్యలను వేగవంతం చేశారు. ప్రస్తుతం బరన్వాల్‌ గేట్‌వేఫర్‌ ఆక్సిలరేటెడ్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ న్యూక్లియర్‌లో డైరెక్టరుగా పనిచేస్తున్నారు. ఈ ప్రతిపాదనను సెనెట్‌ ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత ఆమెకు అణుశక్తి సాకేంతికత పరిశోధన, అభివృద్ధి, నిర్వహణ వంటి అదనపు బాధ్యతలుంటాయి.