ఎన్సిపిలో చేరిన గుజరాత్‌ మాజీ సియం

s s vaghela, sarad pawar
s s vaghela, sarad pawar

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌, బిజెపిలకు దూరంగా కొత్త రాజకీయ అంకం ప్రారంభిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన గుజరాత్‌ మాజీ సియం శంకర్‌ సింగ్‌ వాఘేలా మంగళవారంనాడు నేషలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సిపి)లో చేరారు. ఎన్సిపి కండువా కప్పుకున్నారు. ఎన్‌సిపి చీఫ్‌ శరద్‌ పవార్‌ సమక్షంలో ఆయన చేరారు. ప్రజాసమస్యలు లేవనెత్తాలంటే ఒక మంచి వేదిక కావాలని , ఇదే విషయమై శరద్‌ పవార్‌తో చర్చించినట్లు ఆయన తనను పార్టీలోకి ఆహ్వానించినట్లు వాఘేలా తెలిపారు.