ఎన్నో సానుకూల విజయాలు

AP ASSEMBLY
Governer

ఎన్నో సానుకూల విజయాలు

అమరావతి: గత రెండున్నరేళ్లలో ఎపి ఎన్నో సానుకూల విజయాలను సాధించిందని గవర్నర్‌ నరసింహాన్‌ అన్నారు. వెలగపూడిలోని నూతన సచివాలయంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ తొలి ప్రసంగంచేస్తున్నారు.. సంక్షోభాలను ఎపి అవకాశాలుగా మలచుకుందన్నారు. 2015-16లో రెండంకెట వృద్ధిరేటు సాధించిందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 24శాతం వృద్ధి సాధించిందన్నారు.. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తిచేసి కృష్ణా డెల్టాకు నీరందించిందన్నారు.. రికార్డు సమయంలో సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం చేపట్టిందన్నారు.. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్‌ఇడి దీపాలను ఏర్పాటు చేసిందన్నారు.

2020లో దేశంలోని తొలి 3 రాష్ట్రాల్లో ఎపి

2020 నాటికి దేశంలోని మొదటి మూడు రాష్ట్రాల్లో ఎపిక ఒకటిగా ఉంటుందన్నారు.

వ్యవసాయంలో అభివృద్ధి

రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉన్నా ఎపిలో వ్యవసాయంలో వృద్ధి సాధించిందన్నారు..

అనుకున్న సమయానికి పోలవరం

పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తిచేస్తామని ఆయన తెలిపారు.. పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయన్నారు.. ఏడుమిషన్లు, 5 గ్రిడ్‌లతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించామని గవర్నర్‌ వివరించారు.