ఎన్ని కేసులు పెట్టిన వెనక్కి తగ్గేది లేదు

కొడంగల్: ఏఐసీసీ అధ్యక్షుడ రాహుల్‌గాంధీ రాకతో కోస్గి పునీతమైందని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. నన్ను కొడంగల్ ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకున్నారు. కెసిఆర్‌పై పోరాటం చేస్తున్నందుకు నామీద 39అక్రమ కేసులు పెట్టారు. అయినా వెనక్కి తగ్గేది లేదు ప్రజల అండతో చివరిదాకా పోరాటం చేస్తా కురుక్షేత్రంలో ప్రజలే గెలుస్తారు అని రేవంత్‌రెడ్డి చెప్పారు.