ఎన్నికల సీజన్‌లో బయోపిక్‌ల హల్‌చల్‌

biopics hulchul
biopics hulchul

న్యూఢిల్లీ: ఎన్నికలసందడి దేశవ్యాప్తంగా అన్ని రాస్ట్రాల్లోను ఊపందుకుంది. పోలింగ్‌కు మరో మూడునెలల సమయం మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో పార్టీలు, నాయకులు అందరూ తమతమ విమర్శలతో అస్త్రశస్త్రాలను సంధిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీలు ప్రచారసభల్లో మరింతగా ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో ఎన్నికల సీజన్‌ సమీపిస్తుంటే నేతలు బయోపిక్‌లకు తెగ డిమాండ్‌ వచ్చింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌,వైఎస్‌ఆర్‌ జీవితచరిత్రల ఆధారంగా సినిమాలు వచ్చాయి. తాజాగాప్రధాని నరేంద్రమోడీ,కాంగ్రెస్‌ జాతీయ అధ్యఓఉడు రాహుల్‌గాంధీలపై బయోపిక్‌చిత్రాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే మోడీ బయోపిక్‌ సినిమాకు సంబంధించి అహ్మదాబాద్‌లో షూటింగ్‌ ప్రారంబించారు. పలుదశల్లో గుజరాత్‌లోనిఇతర ప్రాంతాల్లోకూడా చిత్రీకరిస్తున్నారు. ఒమంగ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలివుడ్‌ నటుడు వివేక్‌ఓబరా§్‌ు మోడీ పాత్రను పోషిస్తున్నారు. బొమన్‌ ఇరానీ, దర్శన్‌కుమార్‌ తదితర నటులతో పిఎం నరేంద్రమోడీ టైటిల్‌తో ఈమూవీ వస్తోంది. సందీప్‌సింగ్‌, సురేష్‌ఓబరా§్‌ులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శరవేగంగాపూర్తిచేసేందుకు ప్లాన్‌చేస్తున్నారు. గుజరాత్‌ ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో షూటింగ్‌ జరగనున్నది. ఈ సినిమాలన్నీ ఎన్నికలే లక్ష్యంగా వస్తున్నాయి. మోడీ, రాహుల్‌బయోపిక్‌ సినిమాలకు మంచి డిమాండ్‌ ఉంటుందని అంచనా. 2014 ఎన్నికల్లో పూర్తిగా సోషల్‌మీడియాపై ఆధారపడిన మోడీ ఈసారి వినూత్నంగా సినిమాలను ఎంచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగాచూస్తే ఎన్నికలకు ముందువస్తున్న మోడీ రాహుల్‌ చిత్రాలకే మంచి డిమాండ్‌ ఉంటుందన్న అంచనాలున్నాయి. ఇక మైనేమ్‌ఈజ్‌రాగా అనే టైటిల్‌తోరాహుల్‌గాంధీ బయోపిక్‌ వస్తోంది. అందులో ఆయన వ్యక్తిగత రాజకీయ జీవితానికి సంబంధించిన ఎన్నోకోణాలుచూపించనున్నారు. ఇందిరాగాంధీ హత్యమొదలుప్రస్తుత ఎనినకలవరకూ వివిధ సన్నివేశాలు ఉండనున్నాయి. సెయింట్‌డ్రాకులా, కామసూత్రలాంటిసినిమాలుతీసిన దర్శకుడు పాల్‌ రూపేష్‌ రాహుల్‌ బయోపిక్‌ బాద్యతలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఫస్ట్‌లుక్‌కూడా విడుదలయింది. రాహుల్‌గాంధీ రాజకీయ అరంగేట్రం ఏవిధంగా జరిగిందన్న అంశం ఈ సినిమాలో కళ్లకు కట్టనున్నారు. ఇది కేవలం బయోపిక్‌ మాత్రమేకాదని, రాహుల్‌పైజరుగుతున్న దాడులనుంచి ఆయన ఎలా బయటపడుతున్నారనే వృత్తాంతంతో సినిమా తీస్తున్నట్లు దర్శకులు తెలిపారు.ఈసినిమాలో ప్రియాంక గాంధీ ఎంట్రీని చివరిసీన్‌గా షూట్‌చేస్తామని చెపుతున్నారు. ఆసక్తికరమైన లొకేషన్స్‌తోపాటు అమెరికాలోని కొల్లిన్‌ కాలేజీలో కొంతమేర షూటింగ్‌ జరుపుతామంటున్నారు. అలాగే ఇటలీలోని రాహుల్‌గాంధీ తాత ఇంట్లో కీలక సన్నివేసాలు తీస్తామని అన్నారు. తక్కువ షెడ్యూల్స్‌తోనే సినిమాను త్వరలో పూర్తిచేస్తామని చెపుతున్నారు. ఇప్పటికే ఎన్‌టిఆర్‌టోపాటు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌పై ముమ్ముట్టి నటించిన యాత్రలు హల్‌చల్‌చేస్తుంటే తమిళనాడులో ఎంజిఆర్‌,జయలలితల బయోపిక్‌లు తెరకెక్కించేప్రయత్నాలు జరుగుతున్నాయి.