ఎన్నికల వేళ మోడీ మరో తాయిలం

modi
modi

పేదపిల్లలకు అన్నిస్కూళ్లలో 25శాతం రాయితీ
న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ప్రధాని నరేంద్రమోడీ మరిన్ని వరాలు కురిపిస్తున్నారు. పేదపిల్లలకు అన్ని స్కూళ్లలో 25శాతం విద్యాభ్యాసంలోస ఈట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అగ్రవర్ణపేదలకు విద్యా ఉద్యోగరంగాల్లో పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సంచలన నిర్ణయం ప్రకటించిన మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు మరో అస్త్రాన్ని ప్రయోగించింది. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు మరో తాయిలాన్ని అందించాలనినిర్ణయించింది. ఇపుడు ఆర్ధికంగా వెనుకబడిన కులాలకు చెందిన విద్యార్ధులకు అన్నిస్కూల్లలో 25వాతం కోటా సీట్లు కేటాయించాలనినిర్ణయించారు. మైనార్టీ స్కూళ్లు మినహా ఇతర అన్ని ప్రైవేటు స్కూళ్లకు ఇది వర్తించనున్నది. 12వ తరగతి ఇంటర్మీడియేట్‌వరకూ అన్ని విద్యాసంస్థల్లోను అమలుచేయాలని కేంద్ర విద్యాశాఖ అంటే మానవవనరుల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. 2009 ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ఆర్‌టిఇ ప్రకారం కేవలం ఆరేళ్లనుంచి 14 ఏళ్లపిల్లలకు మాత్రమేమేలు జరుగుతున్నది. కేవలం ఒకటవ తరగతినుంచి 8వ తరగతివరకూ చదివే పిల్లలకు మాత్రమే ఈ చట్టం అమల్లో ఉంది. ఆ తర్వాత క్లాసులకు తల్లితండ్రులు పీజులు చెల్లించాల్సి వచ్చేది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈపరిధిని 12వ తరగతివరకూ పెంచుతోంది. మానవ వనరుల అభివ1ద్ధిశాఖ విద్యాహక్కుల కార్యకర్త అశోక అగర్వాల్‌కు రాసిన లేఖలో వెల్లడించింది. అయితే 2009 విద్యాహక్కుచట్టానికి మార్పులుచేయాలని దీని పరిధిని పెంచేందుకు 2012లోనే డిమాండ్లు వచ్చాయి. కేంద్ర మాధ్యమికవిద్యాశాఖబోర్డు కూడా ఇదే విషయాన్ని అప్పటి యుపిఎ ప్రభుత్వానికి సూచించినా అది కార్యరూపం దాల్చలేదు. గత మార్చిలో పార్లమెంటులో కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుత బిజెపి ప్రభుత్వం అలాంటి ఆలోచన ఏదీలేదని వెల్లడించారు. తాజాగా ఈ అంశం అశోక్‌ అగర్వాల్‌ద్వారా మళ్లీ వెలుగులోనికి వచ్చింది. ఆర్ధికంగా వెనుకబడిన తరగతుల పిల్లలు 8వ తరగతి దాటినతర్వాత వారి తల్లితండ్రులు ఎదుర్కొంటునన ఆర్ధిక ఇబ్బందులనుప్రస్తావిస్తూ హెచ్‌ఆర్‌డి మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌కు లేఖరాసారు. అయితే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న కేంద్రం ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తేలింది. హెచ్‌ఆర్‌డి మంత్రిత్వశాఖ అగర్వాల్‌కు లేఖరాస్తూ అమలుచేస్తామని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమలులోనికిస్తే ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు భారీ ఊరట లభిస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు. అయితే ఎన్నికలు ముందుకు వస్తున్ననేపథ్యంలో మోడీ కావాలనే కోల్ట్‌స్టోరేజిలోపెట్టేసిన ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చాన్న విమర్శలు ప్రతిపక్షాలనుంచి వినిపిస్తున్నాయి.