ఎన్నికల ప్రక్రియ కలుషితమైందా?
నామినేషన్ల ప్రక్రియ నుండి పోలింగ్ వరకు మద్య నిషేధం విధించాలి

అర్థరాత్రి స్వాతంత్య్రం ప్రకటించగానే ప్రజలంతా ఆనందపరవశంతో కేరింతలు కొడు తూ వీధులలో పరుగులు తీసారట. నాలుగైదు గంటల అనంతరం ఉద యం ఆరుగంటలకుమహాత్మాగాంధీ పదిహేను ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ లను పిలిచి ప్రధానిని (నాయకున్ని) ఎన్నుకోవలసిందిగా కోరాడు.
పిసిసిలు దాదాపు రెండు గంటలు చర్చించి పన్నెండు పిసిసిలు సర్ధార్ వల్లబాయి పటేల్‌ను, మిగిలిన పశ్చిమబెంగాల్,కేరళ,తమిళనాడు రాష్ట్రాల పిసిసిలు వారి రాష్ట్రాలకు చెందిన సీనియర్ నాయకులను ప్రధాని పదవికి సూచించారు.
ఏ ఒక్క పిసిసి కూడా నెహ్రూను ప్రతిపాదించ లేదు. ఎజెండా తీర్మానాన్ని గాంధీకి అందచేసి, ఆయన తీర్మాన విషయాన్ని నెహ్రూకు చెప్పి,ఉప ప్రధానిగా హోంమంత్రిగా ఉండ వలసి వస్తుందని చెప్పాడు.కాని నెహ్రూ నంబరు వన్‌గానే ఉంటాను కాని నంబర్ టూగా ఉండనని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని పటేల్‌కు చెపితే తన ప్రధానమంత్రి పదవిని నెహ్రూకు త్యాగంచేసి,తను ఉపప్రధాని, హోంమంత్రి పదవులు తీసుకున్నా రు.
కారణం పటేల్‌కు తెలుసు గాంధీకి అత్యంత ప్రియశిష్యుడు నెహ్రూనే అని. అంటే మనకు స్వాతంత్య్రం లభించిన అయిదారు గంటలలోనే ప్రజాస్వామ్యం పప్పులో కాలేసింది. అంతేకాకుండా వంశపారంపర్య పరిపాలనకు అంకురార్పణ జరిగి దేశంలో ఓ దుష్ట ప్రక్రియకు బీజం పడింది అని చెప్పవచ్చు.
18 సంవత్స రాలు నెహ్రూ పాలన, మధ్యలో ఓ 18 నెలలు శాస్త్రిని ఉండనిచ్చారు.ఆ తరువాత నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ 13 సంవ త్సరాలు. ఆమె తరువాత ఏ మాత్రం రాజకీయ అనుభవం లేక పోయినా ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్‌గాంధీ, ఆ తరువాత ఆయన భార్య సోనియాగాంధీ ప్రధాని అయింది.
సోనియాగాంధీ ఎప్పుడు ప్రధాని అయింది?అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే. చేతులుపుకుంటూ సోనియా ముందు నడిచేవారేకాని, ఏ రోజు కూడా దేశాన్ని నడిపించలేదు. కనీసం పది సంవత్సరాలలో ఒక్క మాట కూడా మాట్లాడి ఎరుగడు మన్మోహన్సింగ్. అందుకే ఆయనను మౌన మన్మోహన్సింగ్ అంటారు. ఈ విధంగా పేరుకు మాత్రమే ప్రజాస్వామ్య పరిపాలన అయినా దాదాపు 46 సంవ త్సరాలు వంశపారంపర్య పరిపాలన కొనసాగింది.
ఈ దుష్టసంప్రదాయం కేంద్రంలోనే కాకుండా ఆయా రాష్ట్రాలలో కూడా కొనసాగుతూ వస్తుంది. మధ్యప్రదేశ్‌లో లాలూప్రసాద్‌ను ముఖ్యమంత్రి పదవినుండి తొలగించగానే ఏమాత్రం అక్షరజ్ఞానం, రాజకీయ అనుభవం లేని ఆయన భార్య రబ్డీదేవిని ముఖ్య మంత్రిగా నియమించుకున్నారు.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో వై.యస్ రాజశేఖరరెడ్డిని దృష్టిలో పెట్టుకొని ఆయన కొడుకును ముఖ్యమంత్రి పదవికి ఎన్నుకున్నారు.ఇక తెలంగాణ విషయానికి వస్తే కె.చంద్రశేఖరరావు తరువాత ఆయన కుమారుడు టి.రామారావు ముఖ్యమంత్రి అవుతాడని బలంగా వినబడుతున్నాయి. అంటే అక్బరు తరువాత బాబర్, బాబర్ తర్వాత ఔరంగజేబు లాగా అన్నమాట. తండ్రి తరువాత కొడుకు, భర్త తర్వాత భార్య ఇలా ఏమాత్రం రాజకీయ అనుభవం లేకపోయినా పదవులు అలంకరిస్తున్నారు.
అనుభవం ఉండి,అసలైన రాజకీయ నాయకులు మరుగునపడి నిరాశకు గురవుతున్నారు. డబ్బుకు లోకం దాసోహం అన్నారు. ఎన్నికల సమ యంలో పంచే డబ్బులకు ప్రజలు దాసోహం అవుతున్నారు. ఎన్ని కలు వచ్చినప్పుడు అభ్యర్థుల గుణగణాలను, సేవాగుణాలను పరి శీలించడం లేదు. అధిష్టానవర్గంవారు అయిదారు కోట్లు ఖర్చు పెట్టగల స్థితిలో ఉన్నాడా? లేడా? అని మాత్రమే చేస్తున్నారు. ఎన్నికలలో బాగా డబ్బు ఖర్చుపెట్టే విషయంలో దేశంలోనే రెండు,మూడు రాష్ట్రాలు ముందున్నాయి.
మొన్న నగరపాలక సంస్థ ఎన్నికలలో ఒక్కో కార్పొరేటర్ నాలుగైదు కోట్లు ఖర్చు పెట్టిఉండవచ్చు. కార్పొరేటర్‌కు సుమారు 42వేల ఓట్లు ఉంటా యి. కాని ధనం ఏరులైపారింది. డబ్బున్న కోటీశ్వరులే ఎన్ను కోబడుతున్నారు.అందుకే ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపిలు, కార్పొ రేటర్లు అందరు కూడా కోటీశ్వరులే అని చెప్పవచ్చు.
ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య తల్లి పెంకు టిల్లు కూలిపోతే పూరిగుడిసెలో నివసిస్తూ, కట్టెల పొయ్యిపై వంట చేసుకుంటూ బతికింది. సంజీవయ్యకు కొడుకులున్నా రాజ కీయాలలోకి రానివ్వలేదు. లాల్‌బహుదూర్‌శాస్త్రి, ప్రధానిగా ఉన్న ప్పుడు ఇద్దరు కొడుకులు బ్యాంకు లోను తీసుకొని ఫియెట్ కారు కొనుక్కున్నారు.శాస్త్రి చనిపోయే నాటికి పంజాబ్నేషనల్బ్యాంకుకు ఇంకో ఇరవై వేలు బాకి ఉన్నారు.
బ్యాంకు వాళ్లు బాకీసొమ్మును కట్టనవసరం లేదు అని చెప్పినా శాస్త్రి భార్య తన పెన్షన్ నుండి నెలనెల కట్టి బాకీ తీర్చారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారి కర్ హెల్మెట్ పెట్టుకొని బైక్‌పై ఇంటి నుండి సచివాలయానికి వెళ్లే వారు. ఇద్దరు కొడుకులున్నా రాజకీయాలలోకి తీసుకొని వంశపార పర్యానికి పాల్పడలేదు.
ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ 13 సంవ త్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా కూడా గత ఏడు సంవత్సరా లుగా ప్రధానమంత్రిగా చేస్తున్నా కూడా తల్లి కర్రకూర్చీలోకూర్చొని ఫోర్టేబుల్ టి.వి చూస్తూ ఉంటుంది.భార్య తన పెన్షన్‌తో బతుకుతూ ఉంది.
మోడీ కుటుంబ సభ్యులెవరూ కూడా ప్రభుత్వ బంగళాలలో నివసించడం లేదు.ఇటువంటి ఆశ్చర్యకర విషయాలు ప్రపంచ రాజకీయ నాయకుల చరిత్రలలో ఉన్నాయా? ఎన్నికల పోటీలో ఉండే అభ్యర్థుల కులాన్ని చూస్తున్నారే గాని, గుణగణా ల్ని చూడటంలేదు.
భారతదేశం మొత్తంలో ఈ కులపిచ్చి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంతగా మరే రాష్ట్రంలో లేదు. ఈ కులపిచ్చితో నేరా లలో ఆరితేరిన వారు రాజకీయాలలోకి వస్తున్నారు. ఈ కులపిచ్చి భారతదేశంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదు.
ఇక మద్యం సేవించి వాహనం నడపరాదనే నియమం విధించారు. కారణం తాగి నడిపితే తాను ప్రమాదానికి గురికావచ్చు. లేక ఎదుటివారిని ప్రమాదానికి గురి చేయవచ్చు.ఇటువంటివి మనం ప్రతిరోజూ పేపర్లలో చదువుతున్నాం.
మరి తాగి ఓటువేసేవాళ్లు సరైన నాయ కుల్ని ఎన్నుకోలేకపోవడం చాలా పెద్ద తప్పుకదా! నామినేషన్ల ప్రక్రియ అయిపోయిన నాటి నుండి ఓటింగు నాటివరకు మద్యం ఏరులై పారుతుంది.ఇంటింటికి మద్యం సీసాలు సరఫరా మామూలైంది. మొన్న మున్సిపల్ ఎన్నికలలో పదిరోజులు కోట్ల రూపా యల మద్యం అమ్ముడైందని పత్రికలలో చదివాం.అంటే ఎన్నికలలో మద్యం పాత్ర ఎంతోఉంది. అప్పుడప్పుడు ఎన్నికల సమ యాలలో కోట్లాది రూపాయల విలువైన మద్యం పట్టుబడుతుంది.
ముఖ్యంగా గ్రామాల్లో ఎన్నికలొచ్చాయి అంటే తాగుబోతులకు పండుగేపండుగ. దీనివల్ల యోగ్యులైన నాయకులను ఎన్నుకోలేకపోతున్నాం. దీనికి ఒకటే మార్గం. నామినేషన్ల ప్రక్రియ నుండి ఓటింగు వరకు మద్య నిషేధం విధించాలి. ఈ వంశపారపర్యం, ధనం, కులం, మద్యం, ఈ నాలుగింటిని దూరం చేసినప్పుడే మన ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుంది.
- మునిగంటి శతృఘ్నచారి
(రచయిత: కార్యదర్శి, రాష్ట్ర బి.సి సంఘం, తెలంగాణ)