ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

RAJATH KUMAR
RAJATH KUMAR

రైతుబంధు, బతుకమ్మ చీరెల పంపిణీపై వివిధ పార్టీల అభ్యంతరాలు
వాటిని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించాం : సీఈసీ రజత్‌కుమార్‌
హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికల నిర్వ హణకు తాము సిద్దమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ ప్రకటించారు. పోలింగ్‌ స్టేషన్లకు సరిపడా ఈవీఎంలు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. అంతేగాక 100 అదనపు పోలింగ్‌ స్టేషన్లకు సరిపడా ఈవీఎంలు ఇచ్చేందుకు భెల్‌ కంపెనీ సిద్దంగా ఉందన్నారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ఫామ్‌ 6 ద్వారా 19.5 లక్షల కొత్తగా ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారని, వీటిలో 1.5 లక్షల ఓటర్లను రిజెక్ట్‌ చేశామన్నారు. మొత్తంగా 40శాతం కొత్త ఆప్లికే షన్లు ఉన్నాయని,60శాతం పాతవి ఉన్నాయని తెలిపారు.ఇఆర్వో నెట్‌ చాలా స్పీడ్‌గా పనిచేస్తుందని, ఓటర్ల నమోదు విషయంలో ఎన్నికల కమిషన్‌ పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. ‘నియోజకవర్గం వారిగా ఓటర్‌ లిస్ట్‌ను పరిశీలిస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో 13శాతం కొత్త ఓటర్‌లు పెరిగారు. కానీ భద్రాచలంలో 40శాతం ఓటర్లు తగ్గారు. అశ్వరావుపేటలో 21శాతం ఓటర్లు తగ్గారు అని పలు ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ‘రైతుబంధు చెక్కులు, బతుకమ్మ చీరలు రెగ్యులర్‌ గా ఇచ్చే పథకాలు వాటికి నిబంధనలు ఏం ఉండవు, అయితే,మాకు రైతుబంధు, బతుకమ్మ చీరెల పంపిణీపై వివిధ పార్టీల వారు అభ్యంతరాలు ఇచ్చారు. వాటిని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించాం అని స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అన్ని అనుకూలంగా ఉన్నాయని, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఏర్పాట్లు మెరు గ్గా ఉన్నాయని అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో 4.16 లక్షల దివ్యాంగ ఓటర్లు ఉన్నారని, వారు ఓటింగ్‌లో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.దివ్యాంగులకు రవాణా సౌకర్యం కల్పిస్తామని, వారికి క్యూ లేకుండా చూస్తామన్నారు. పోలింగ్‌ స్టేషన్ల వద్ద తెలుగులో బోర్డ్స్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా కళ్లు లేని వారికి బ్రెయిలీ లిపిలో కూడా ఓటర్‌ కార్డ్స్‌ ఇచ్చేందుకు పరిశీలిస్తున్నామని,రాష్ట్రంలో దివ్యాంగులు ఓట్లు వేసేందుకు మొదటిసారిగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.శాంతిభద్రతల కోసం అడిషనల్‌ డిజిని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను అపాయింట్‌ చేసిందని,ఆయన అన్నీ చూస్తారన్నారు. కాగా, 1950 నెంబర్‌కు రోజు 1400 కాల్స్‌ వస్తున్నాయన్నారు.
‘సెక్యూరిటీ ప్రోటోకాల్‌ చాలా ఉంటుందని, మొత్తం మిషన్లు రిసీవ్‌ చేసుకున్నామన్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా మన్నారు.ప్రజల నమ్మకాన్ని పొందేందుకు డెమోలు నిర్వహిస్తున్నామన్నారు. ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ అడిట్‌ వీవీ ప్యాట్లు ప్రతి ఒక్కరు మాక్‌ పోలింగ్‌లో పాల్గొనాలి. జర్మనీలో ఎలక్ట్రానిక్‌ మిషన్లు వాడి తీసివేశారన్నారు. అన్ని దేశాల్లో పరిస్థితులు ఒకేలా ఉండవన్నారు. రెండు కంపెనీలు మిషన్లు తయారు చేస్తున్నాయన్నారు. దేశభద్రతకు అవసరమైన మిషనరీలను ఈ కంపెనీలు తయారు చేస్తాయన్నారు. మిషనరీల తయారీలో మూడో వ్యక్తి ప్రమేయం ఉండదన్నారు. మిషనరీల పంపిణీ కూడా అత్యంత భద్రత మధ్య జరుగుతుందన్నారు. మూడు స్టేజీల్లో ఈ మిషనరీలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియద న్నారు. స్టోరేజ్‌ పాయింట్లలో భద్రత అత్యంత కఠినంగా నిరంతర నిఘా నీడలో ఉంటుందన్నారు. ఎవరైనా ఎత్తు కెళ్లాలని చూసినా షేక్‌ చేసినా మిషన్‌ నిలిచిపోతుందని, దానిని మరో మిషన్‌తో ఎన్నికలు నిర్వహించాల్సిందే అన్నారు. బ్యాలెట్‌ బాక్స్‌తో ఇంత సెక్యూరిటీతో ఓటింగ్‌ నిర్వహించలేమన్నారు. డిఫెన్స్‌ ఎక్విప్‌మెంట్‌ తరహాలో ప్రీక్వెన్సీ సెట్‌ చేస్తామన్నారు. 1982లో మొదటిసారి వాడాం, వీవీ ప్యాట్లు చిన్న చిన్న ఎన్నికల్లో వాడాం. చాలా చాలెంజెస్‌ కోర్టుకు వెళ్లినా వందశాతం ఈవీఎంల వైపే తీర్పు వచ్చిందన్నారు. బ్యాలెట్‌ ఓటింగ్‌ ఫిజికల్‌ స్ట్రెస్‌ తప్పా ఏమీ ఉండదన్నారు. ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయన్నారు. ఈ రోల్‌ 11 లక్షల 70వేలను క్లీయర్‌ చేయాలన్నారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో తీసివే యలేమని, కొద్దిగా సమయం పడుతుందన్నారు. 80శాతం ఎఫ్‌ఎల్సీలు పూర్తి చేశామని, ఢిల్లీ నుంచి ఈసీఐ కన్సల్‌టెంట్‌ శర్మ వచ్చి ఎప్‌ఎల్సీల తీరును పరిశీలిస్తున్నారన్నారు.లా అండ్‌ అర్డర్‌పై పోలీసులతో నిరంతరం చర్చలు జరుపుతున్నామన్నారు. లిక్కర్‌ మనీ సర్క్యూలేషన్‌ పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. ఎన్నికల ఏర్పాట్ల పనులు నిరంతరం సాగు తుంటాయన్నారు. సీసీటీవీల ఏర్పాట్లతో పాటు సిటిజన్‌ విజిల్‌ అంటే పౌరులు జాగ్రత్త అనే అంశాన్ని తెరపైకి తెస్తున్నా మన్నారు.యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి ఎక్కడ ఎన్నికల మాల్‌ ప్రాక్టీస్‌ జరిగినా జాతీయ ఎన్నికల కమిషన్‌ వెళుతుందన్నారు. ఐదు నిమిషాల్లో కలెక్టర్లు స్పందించాలని, అరగంటలో అక్కడికి చేరుకొని గంట లోపు చర్యలు తీసుకుని ఆప్డేట్‌ చేయా లన్నారు. ఈర్వోనెట్‌ ద్వారా ఏరివేత సులభమైందని, తప్పు ఓటు పడిందని చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఓటరు తప్పు గా చెబితే వారిపైనా చర్యలు ఉంటాయన్నారు.ఈ రోజు నుంచి అన్ని జిల్లాల్లో వివి పాట్స్‌ మొదటి లెవల్‌ చెకింగ్‌ ప్రారంభిస్తామ న్నారు. ఈ మిషన్లకు పవర్‌తోగానీ వాతావరణంతో సంబంధం లేదన్నారు.